AliaBhatt: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఇటీవల బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. చిన్నారికి రేహా కపూర్ అనే పేరు పెట్టారు. రణబీర్ కపూర్ సినిమా షూటింగ్ లకు కాస్త గ్యాప్ ఇచ్చిన భార్య,కూతురిని చూసుకుంటున్నాడు. గత కొంతకాలంగా ఇంట్లోనే ఉండి వారితో సమయం గడుపుతున్నాడు. ఇక అలియా భట్ ప్రెగెన్సీ సమయంలో బాడీలో వచ్చిన మార్పులను మార్చుకోవడానికి జిమ్, యోగా లాంటికి చేస్తోంది. తిరిగి ఇంతకుముందులా తయారయ్యేందుకు కసరత్తులు చేస్తోంది.
అలియా భట్ కూడా కొద్దిరోజుల పాటు సినిమాల నుంచి గ్యాప్ తీసుకుంది. కూతురిని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది. అయితే తాజాగా ఓ ఫోటోను సోషల్ మీడియాలో అలియా భట్ పంచుకుంది. ఈ ఫొటోలో తన కూతురితో పాటు అలియా భట్ ఉంది. బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నట్లు ఈ ఫొటోలు ఉంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఎరుపు రంగు చీరలో నవ్వుతూ తన కూతురికి ఫీడింగ్ చేస్తున్నది.
ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. నెటిజన్లు అలియా భట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చాలామంది హీరోయిన్ల సరోగసి ద్వారా బిడ్డలను కంటున్న తరుణంలో.. అలియా భట్ సహజ పద్దతిలో గర్భం దాల్చి బిడ్డకు జన్మనివ్వడం మంచి పరిణామని చెబుతున్నారు. నిజమైన తల్లి ప్రేమే అప్పుడు తెలుస్తుందని, సరోగసి, ఇతర విధానాల ద్వారా బిడ్డలను కన్నప్పుడు ప్రేమ తెలియదని చెబుతున్నారు.
అయితే అలిమా భట్ ప్రస్తుతం కొంచెం లావుగా తయారైంది. దీంతో బాడీని తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. చివరిగా బ్రహ్మస్త సినిమాలో అలియా భట్ నటించింది. ఆ తర్వాత షూటింగ్ లకు కాస్త గ్యాప్ ఇచ్చింది. త్వరలోనే షూటింగ్ లను అలియా భట్ తిరిగి ప్రారంబించే అవకాశముందని తెలుస్తోంది. అలియా భట్ చేతుల్లో చాలా ప్రాజెక్టుకు ప్రస్తుతం సిద్దంగా ఉన్నాయి.