Fraud : ప్రముఖ బాలీవుడ్ నటి ఆలియా భట్ తన వ్యక్తిగత సహాయకురాలిగా పని చేసిన మహిళ చేతిలో మోసానికి గురైందని తాజా కేసులో వెలుగులోకి వచ్చింది. వేదిక ప్రకాశ్ శెట్టి అనే 32 ఏళ్ల మహిళ, మూడు సంవత్సరాల పాటు ఆలియా వద్ద పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ, ఆమెకు తెలిసినట్టు లేకుండా భారీగా నకిలీ బిల్లులు రూపొందించి దాదాపు రూ.77 లక్షలు కాజేసినట్లు పోలీసులు వెల్లడించారు.
మోసం ఎలా జరిగింది?
వేదిక శెట్టి 2021 నుంచి 2024 వరకు ఆలియా భట్‌కు వ్యక్తిగత సహాయంగా వ్యవహరించింది. ఈ సమయంలో ఆమె ఆలియాకి సంబంధించిన బ్యాంక్ ఖాతాలు, అలాగే ఆమె నిర్మాణ సంస్థ అయిన ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్కి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను కూడా చూసేది. ఈ బాధ్యతలను ఆమె పూర్తిగా నమ్మకంతో పొందినప్పటికీ, వేదిక ఆ నమ్మకాన్ని ఎటువంటి అనుమానం రాకుండా దుర్వినియోగం చేసింది.
2022 మే నుంచి 2024 ఆగస్టు మధ్య, వేదిక ప్రయాణ ఖర్చులు, మీటింగ్ ఖర్చులు, ఇతర కార్యాలయ అవసరాల పేరుతో నకిలీ బిల్లులను తయారు చేసి, వాటిపై ఆలియా సంతకాలు తీసుకున్నట్లు తెలిసింది. బిల్లులు పూర్తిగా నమ్మకంగా కనిపించేలా ప్రొఫెషనల్ డిజైన్ టూల్స్ ఉపయోగించిందని పోలీసులు తెలిపారు. ఆమోదం లభించిన వెంటనే వాటి ఆధారంగా వచ్చే మొత్తాన్ని ముందుగా తన స్నేహితురాలికి చెందిన ఖాతాలోకి మళ్లించి, తర్వాత తన ఖాతాలోకి తీసుకునే పద్ధతిలో వ్యవహరించినట్లు విచారణలో తేలింది.
MLA Assault : క్యాంటీన్ సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి..ఇదే శివసేన స్టైల్ అంటూ వ్యాఖ్య
కేసు నమోదు, అరెస్ట్ వరకు జరిగిన ఘటనలు
ఈ మోసాన్ని ఆలియా తల్లి, నటి సోనీ రజ్దాన్ గుర్తించి, 2024 జనవరి 23న జుహు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు విచారణ ప్రారంభించి, వేదికపై చీటింగ్, నమ్మకద్రోహం, నకిలీ పత్రాల తయారీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణ ప్రారంభమైన వెంటనే వేదిక పరారైంది. రాజస్థాన్, కర్ణాటక, పూణే వంటి ప్రాంతాల్లో తనను తాను దాచుకునే ప్రయత్నం చేసిన ఆమెను చివరికి బెంగళూరులో గుర్తించిన పోలీసులు, ఆమెను అరెస్ట్ చేశారు. ట్రాన్సిట్ రిమాండ్పై ఆమెను ముంబైకి తరలించారు.
పరిశీలనలో ఉన్న పలు కోణాలు
వేదిక మోసం చేసిన మొత్తం రూ.76.9 లక్షలు కాగా, ఈ మొత్తాన్ని ఎలా ఖర్చు పెట్టిందన్నదాని పై పోలీసులు ఇంకా విచారణ చేస్తున్నారు. ఆమె స్నేహితురాలితో పాటు ఇతర వ్యక్తులు ఈ మోసంలో భాగమయ్యారా అనే కోణాలు కూడా ప్రస్తుతం పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.
ఈ ఘటన ఆలియా భట్ వంటి బిజీ సెలబ్రిటీలకు దగ్గరగా పనిచేసే సహాయక సిబ్బంది నైతికతపై సీరియస్ ప్రశ్నలు రేపుతోంది. నమ్మకానికి విలువ ఉండాల్సిన చోట ఆ విశ్వాసాన్ని వాణిజ్యంగా మార్చిన వేదిక చర్యలు పరిశ్రమలో భద్రతా ముడతలు పెంచేలా చేస్తున్నాయి.
MLA Assault : క్యాంటీన్ సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి..ఇదే శివసేన స్టైల్ అంటూ వ్యాఖ్య