Alia Bhatt : అలియా భట్ నెక్స్ట్ సినిమా వచ్చేస్తుంది.. టైటిల్ అనౌన్స్..

తాజాగా అలియా భట్ తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేసింది.

Published By: HashtagU Telugu Desk
Alia Bhatt Announced her next Movie Jigra

Alia Bhatt Announced her next Movie Jigra

బాలీవుడ్(Bollywood) స్టార్ హీరోయిన్ అలియా భట్(Alia Bhatt) ప్రస్తుతం వరుస సినిమాలతో, వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. గత సంవత్సరం గంగూబాయి కతీయవాడి, RRR, డార్లింగ్స్, బ్రహ్మాస్త్ర సినిమాలతో వరుస హిట్స్ కొట్టింది. ఈ సంవత్సరం కూడా ఇప్పటికే రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని, హార్ట్ ఆఫ్ స్టోన్ హాలీవుడ్ సినిమాతో పర్వాలేదనిపించింది. ఇటీవలే గంగూబాయి కతీయవాడి సినిమాకి నేషనల్ అవార్డు కూడా గెలుచుకొని ఫుల్ ఫామ్ లో ఉంది.

తాజాగా అలియా భట్ తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేసింది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ వాసన్ బాల(Vasan Bala) దర్శకత్వంలో జిగ్రా(Jigra) అనే సినిమాతో అలియా రాబోతుంది. తాజాగా సినిమా టైటిల్ ని అనౌన్స్ చేస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఒక సోదరుడి కోసం సోదరి చేసే పోరాటమే ఈ కథ అని తెలుస్తుంది.

ఇక ఈ జిగ్రా సినిమాకు అలియా భట్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. కరణ్ జోహార్, అపూర్వ మెహతాలతో కలిసి అలియా భట్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాని వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 27న రిలీజ్ చేయబోతున్నట్టు కూడా ప్రకటించారు.

 

Also Read : Akhil Akkineni : హిట్ కోసం అఖిల్ రాజమౌళి హెల్ప్ తీసుకోబోతున్నాడా?

  Last Updated: 26 Sep 2023, 09:35 PM IST