Alia and Ranbir: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన అలియా భట్!

ఆలియా, రణ్‌బీర్ కపూర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆదివారం ఉదయం గిర్‌గ్రామ్ లో ఆస్పత్రిలో ఆలియా అడ్మిట్ అయ్యింది.

  • Written By:
  • Updated On - November 6, 2022 / 01:15 PM IST

ఆలియా, రణ్‌బీర్ కపూర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆదివారం ఉదయం గిర్‌గ్రామ్ లో ఆస్పత్రిలో ఆలియా అడ్మిట్ అయ్యింది. మరికొన్ని గంటల్లో తమ బిడ్డకు ఈ లోకంలో వెల్కమ్ చెబుతారని బాలీవుడ్ ఆశగా ఎదురు చూస్తుంది. అందరు భావించినట్టుగానే అలియా భట్ కు డెలివరీ అయ్యింది. ఆస్పత్రి వర్గాల ప్రకారం అలియా పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ వార్త అటు అలియా, ఇటు రణ్ బీర్ కుటుంబాల్లో సంతోషం నింపింది.

ఆలియా భట్-రణ్ బీర్ కపూర్‌లు వివాహబంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఈ జంట ఏప్రిల్ 14న ఇరు కుటుంబాలు, బంధుమిత్రుల మధ్య ఈ జంట ఒక్కటైయారు. అంతేకాదు పెళ్లైనా ఇక రెండు నెలలకే ప్రెగ్నెన్సీని ప్రకటించి అభిమానులకు శుభవార్త చెప్పింది ఆలియా. ఇక్కడ విశేషం ఏమంటే ఆలియా ప్రెగ్నెంట్ తర్వాత కూడా సినిమా షూటింగ్‌లో పాల్గోన్నట్లు తెలుస్తోంది.