Alia Bhatt – NTR : ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర ట్రైలర్ లాంచ్ కోసం ముంబైలో ఉన్న సంగతి తెలిసిందే. ట్రైలర్ లాంచ్ ని బాలీవుడ్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ట్రైలర్ లాంచ్ తో పాటు ఒకేసారి సినిమా ప్రమోషన్స్ కూడా చేసేస్తున్నాడు ఎన్టీఆర్. బాలీవుడ్ లో పలువురు ప్రముఖులను, స్టార్స్ ని కలుస్తూ దేవరని ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ అలియా భట్ ని కూడా కలిసాడు ఎన్టీఆర్.
అలియా భట్ తో ఎన్టీఆర్ RRR సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో అలియా చరణ్ కి కాంబోగా చేసినా ఎన్టీఆర్ తో కూడా సీన్స్ ఉన్నాయి. దీంతో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అలియా నటించిన జిగ్రా సినిమా దసరాకు రాబోతుంది. ఈ సినిమాని కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు. దీంతో కరణ్ జోహార్ ఎన్టీఆర్ – అలియా భట్ లని కలిపి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసాడు.
ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్, అలియా, కరణ్ జోహార్ కలిసి దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఒకేసారి దేవర, జిగ్రా ప్రమోషన్స్ అయిపోతున్నాయి ఈ ఇంటర్వ్యూతో. మొత్తానికి ఎన్టీఆర్ బాలీవుడ్ లో భారీ మార్కెట్ కోసం దేవరతో బాగానే కష్టపడుతున్నాడు.
Also Read : NTR Goosebumps Words : ఆఖరి 40 నిమిషాలు ‘దేవర’ కట్టిపడేస్తుంది – ఎన్టీఆర్