Akshay Kumar: యంగ్ హీరోయిన్ తో అక్షయ్ కుమార్ రొమాన్స్

Wamiqa Gabbi  బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన రాబోయే చిత్రం ‘భూత్ బంగ్లా’లో కథానాయిక వామిక గబ్బితో నటిస్తున్న విషయంపై వస్తున్న విమర్శలకు స్పందించారు. తనకంటే వయసులో చాలా చిన్నవారైన హీరోయిన్లతో రొమాన్స్ చేయడంపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు ఆయన ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఈ విమర్శలపై మాట్లాడుతూ.. సినిమాల్లో పాత్రల మధ్య కెమిస్ట్రీనే ప్రధానం, వయసు కాదని అక్షయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. కథ, దర్శకుడి విజన్ ప్రకారమే నటీనటుల ఎంపిక జరుగుతుందని […]

Published By: HashtagU Telugu Desk
Bhoot Bangla Akshay Kumar

Bhoot Bangla Akshay Kumar

Wamiqa Gabbi  బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన రాబోయే చిత్రం ‘భూత్ బంగ్లా’లో కథానాయిక వామిక గబ్బితో నటిస్తున్న విషయంపై వస్తున్న విమర్శలకు స్పందించారు. తనకంటే వయసులో చాలా చిన్నవారైన హీరోయిన్లతో రొమాన్స్ చేయడంపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు ఆయన ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఈ విమర్శలపై మాట్లాడుతూ.. సినిమాల్లో పాత్రల మధ్య కెమిస్ట్రీనే ప్రధానం, వయసు కాదని అక్షయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. కథ, దర్శకుడి విజన్ ప్రకారమే నటీనటుల ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు. ఒక నటుడిగా విభిన్నమైన పాత్రలు పోషించడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని, ప్రేక్షకులు సినిమాను వినోద సాధనంగానే చూడాలని కోరారు.

గత కొంతకాలంగా అక్షయ్ కుమార్ తన చిత్రాల్లో తన కంటే 20-30 ఏళ్లు చిన్నవారైన హీరోయిన్లతో నటిస్తున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇప్పుడు ప్రియదర్శన్ దర్శకత్వంలో వస్తున్న ‘భూత్ బంగ్లా’లో కూడా యువ నటి వామిక గబ్బి హీరోయిన్‌గా ఎంపిక కావడంతో ఈ చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. చాలా కాలం తర్వాత అక్షయ్ కుమార్, ప్రియదర్శన్ కాంబినేషన్‌లో హారర్ కామెడీ జానర్‌లో ‘భూత్ బంగ్లా’ చిత్రం రాబోతోంది. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘భూల్ భులైయా’ తరహాలోనే ఈ చిత్రం కూడా ఉండబోతోందని ప్రచారం జరుగుతుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో అక్షయ్, వామికతో పాటు ప్రముఖ హాస్యనటులు పరేష్ రావల్, రాజ్ పాల్ యాదవ్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

  Last Updated: 25 Mar 2026, 02:05 PM IST