కరోనా (Corona) దెబ్బకు థియేటర్ల (Movie Theaters) కళ తప్పింది..కరోనా ముందు వరకు కూడా ప్రేక్షకులు (Movie Lovers) థియేటర్స్ కు క్యూ కట్టేవారు. చిన్న , పెద్ద హీరో అనే తేడాలులేకుండా అన్ని షోస్ హౌస్ ఫుల్ తో కొనసాగేవి. ఎప్పుడైతే కరోనా ఎంట్రీ ఇచ్చిందో..థియేటర్స్ మూతపడ్డాయో..అప్పటి నుండి థియేటర్స్ సక్సెస్ ఫుల్ గా రన్ కావడం లేదు. అగ్ర హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రమే థియేటర్స్ రిలీజ్ రోజు హౌస్ ఫుల్ తో కనిపిస్తున్నాయి. సినిమా కు హిట్ టాక్ వస్తే ఓ మూడు రోజులపాటు జనాలతో కళాకలాడుతున్నాయి..అదే సినిమా కు ప్లాప్ టాక్ వస్తే రిలీజ్ రోజు మ్యాట్నీ షో నుండి ప్రేక్షకుల సంఖ్య తగ్గుతుంది. ఇక OTT ల దెబ్బ కూడా థియేటర్స్ ఫై భారీగా పడుతుంది. థియేటర్ లో రిలీజ్ అయినా 20 రోజులకే ఓటిటి లలో స్ట్రీమింగ్ అవుతుండం తో థియేటర్స్ కు వెళ్లి చూసే వారి సంఖ్య భారీగా తగ్గింది.
We’re now on WhatsApp. Click to Join.
ముఖ్యంగా బాలీవుడ్ చిత్రాలు భారీగా నష్టపోతున్నాయి. వందల కోట్ల తో నిర్మించిన చిత్రాలు కనీసం ప్రమోషన్ ఖర్చులు కూడా రాబట్టలేకపోతున్నాయి. దిన్చుకు ఉదాహరణ తాజాగా అక్షయ్ కుమార్ సినిమానే. గత కొంతకాలంగా అక్షయ్ కుమార్ (Akshay Kumar) వరుస ప్లాప్స్ తో సతమతం అవుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా అయన హీరోగా తెరకెక్కిన ‘సర్ఫిరా’ (Sarfira ) రిలీజ్ అయింది. అయితే, ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా కలెక్షన్స్ వసూలు రాబడుతుంది. దీంతో ప్రేక్షకులను అట్రాక్ట్ చేసేందుకు మల్టీప్లెక్స్‌లు కొత్తగా ప్రయత్నాలు చేస్తున్నాయి. మూవీ చూడటానికి వచ్చిన ఆడియెన్స్ స్నాక్స్ ఫ్రీ గా ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి. కథ కనెక్ట్ అయితే పెద్ద సినిమాలు మొదటి రోజే కలెక్ట్ చేయాలి.
కానీ ‘సర్ఫిరా’ సినిమా ఫస్ట్ డే రూ.2.50 కోట్లు, రెండో రోజు రూ.4.50 కోట్లు వసూలు చేసింది. దీనికోసం మల్టీప్లెక్స్ ఆడియెన్స్ కు టీ, సమోసాలను ఆఫర్ చేసింది. ‘పీవీఆర్ ఐనాక్స్’ మల్టీప్లెక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా వెల్లడించింది. సర్ఫిరా మూవీ చూసేందుకు వెళ్లే వారికి 2 సమోసాలు, 1 టీ, 1 లగేజీ ట్యాగ్ ఫ్రీ (Tea samosa Free) గా ఇస్తున్నట్లు ప్రకటించి ప్రేక్షకులను థియేటర్స్ కు తరలించే ప్రయత్నం చేస్తుంది. మరి 20 రూపాయలకు దొరికే టి, సమోసా కోసం రూ.200 పెట్టి టికెట్ కొనుగోలు చేస్తారా అనేది చూడాలి.
Read Also : Polimera 2 : పొలిమేర 2 నిర్మాతకి బెదిరింపులు.. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు..
