Site icon HashtagU Telugu

Kannappa : మంచు విష్ణు ‘కన్నప్ప’లో మరో స్టార్.. బాలీవుడ్ నుంచి ఆ హీరో..

Kannappa

Kannappa

Kannappa : శ్రీకాళహస్తి శివుడి ఆలయ చరిత్ర ఆధారంగా టాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘కన్నప్ప’. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఈ సినిమాని మోహన్ బాబుసుమారు 150 కోట్ల బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీంతో ఈ సినిమాలో భారీ స్టార్ కాస్ట్ ని ఎంపిక చేసుకుంటూ వస్తున్నారు.

ఈక్రమంలోనే ఇప్పటికే రెబల్ స్టార్ ప్రభాస్, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమారు, తమిళ్ స్టార్స్ శరత్ కుమార్, మధుబాల, నయనతార.. ఇలా అన్ని పరిశ్రమలకు సంబంధించిన స్టార్స్ ని ఎంపిక చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నుంచి కూడా ఒక స్టార్ ని రంగంలోకి దించుతున్నారు. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ని ఓ ముఖ్య పాత్ర కోసం మంచు విష్ణు అండ్ టీం సంప్రదించిందట.

అందుకు అక్షయ్ కూడా ఓకే చెప్పడం జరిగింది. దీంతో ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ని కూడా చూడబోతున్నారు. త్వరలోనే ఆయన కూడా షూటింగ్ పాల్గొనున్నారని సమాచారం. కాగా ఈ మూవీ షూటింగ్ న్యూజిలాండ్ అడవుల్లో జరుగుతుంది. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ప్రీతి ముఖుంధన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది.

కాగా గతంలో ఈ కథతో కృష్ణంరాజు ‘భక్త కన్నప్ప’ అనే సినిమా చేశారు. ఆ చిత్రం టాలీవుడ్ లో ఓ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఇన్నాళ్ల తరువాత మళ్ళీ ఆ కథతో మరో సినిమా రాబోతుంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. కృష్ణంరాజు వారసుడు ప్రభాస్ ఈ సినిమాలో శివుడి పాత్ర పోషిస్తుండడం. మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Also read : Allu Arjun Birthday : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్

Exit mobile version