Site icon HashtagU Telugu

Akshay Kumar : నేను చనిపోయినట్టు ఫీల్ అయి మెసేజ్ లు పంపిస్తున్నారు..

Akshay Kumar Interesting Comments on his Flops and Who Feel for his Flops

Akshay Kumar

Akshay Kumar : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఒకప్పుడు వరుస హిట్స్ కొట్టగా ఇప్పుడు వరుస ఫ్లాప్స్ ఇస్తున్నాడు. గత మూడేళ్ళలో అక్షయ్ కుమార్ 14 సినిమాలు రిలీజ్ చేస్తే అందులో రెండు సినిమాలు హిట్ అవ్వగా మిగిలినవన్నీ పరాజయం పాలయ్యాయి. అక్షయ్ కుమార్ పరిస్థితిపై అభిమానులు, నెటిజన్లు, బాలీవుడ్ కూడా బాధపడుతుంది.

కొత్త కొత్త కథలతో వచ్చినా అక్షయ్ కుమార్ సినిమాలు ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి. అక్షయ్ కుమార్ మంచి సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులు, ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అయితే అక్షయ్ కుమార్ కి తెలిసిన వాళ్ళు, సన్నిహతులు కూడా అతని ఫ్లాప్స్ పై విచారం వ్యక్తం చేస్తూ మంచి హిట్ సినిమాతో రావాలని అతనికి బాధగా మెసేజ్ లు చేస్తున్నారట.

దీనిపై అక్షయ్ కుమార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ఏం జరిగినా అంతా మన మంచికే అని నేను నమ్ముతాను. నేను ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ ఫీల్ అవ్వను. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినంత మాత్రాన జనాలు నాకు నేను చనిపోయినట్టు సంతాపం మెసేజెస్ లాగా పంపిస్తున్నారు. నన్ను కంబ్యాక్ ఇవ్వాలని జనాలు అడుగుతున్నారు. నేను ఎక్కడికి వెళ్లాలని కంబ్యాక్ ఇవ్వాలి. నేను ఇక్కడే ఉన్నాను బ్రేక్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాను. నేను కష్టపడి పనిచేసి సంపాదిస్తున్నాను. నేను నా పనిని ఇలాగే కంటిన్యూ చేస్తాను నా జీవితం చివరివరకు అని తెలిపారు. దీంతో అక్షయ్ కుమార్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి అక్షయ్ కుమార్ మళ్ళీ ఒక మంచి కమర్షియల్ హిట్ ఎప్పుడు కొడతాడో చూడాలి.

 

Also Read : Rashmika : విజయ్ దేవరకొండ పోస్టర్ పై రష్మిక ఫైర్..!