Naatu Naatu: నాటు నాటు స్టెప్పును కాపీ కొట్టిన బాలీవుడ్ సెలబ్రెటీస్.. నెట్టింట వీడియో వైరల్?

  • Written By:
  • Publish Date - February 29, 2024 / 02:30 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి బడేమియా ఛోటేమియా అనే ఒక సినిమా చేస్తున్నారు. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని రకాల అప్డేట్లు విడుదలైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి రెండో సింగిల్‌ను ఈ రోజు రిలీజ్ చేశారు. మస్త్ మలాంగ్ ఝూమ్‌ అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే దీనికి కారణం ఇందులో ఉన్న స్టెప్పులే.

అవును మరి! ఆ పాటలు వస్తే స్టెప్పులు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఆర్ఆర్ఆర్‌ లోని నాటు నాటు సాంగ్ గుర్తుకు వస్తుంది. ఈ సాంగ్‌లో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్..ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు పాటకి రామ్ చరణ్- ఎన్టీఆర్ వేసిన హుక్ స్టెప్పును ఇమిటేట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు ఒక రేంజ్‌లో ఆడుకుంటున్నారు. ఆస్కార్ గెలిచిన పాటను మళ్లీ రీ క్రియేట్ చేయడం అవసరమా, ఎన్టీఆర్-రామ్ చరణ్ వేసిన స్టెప్పులను అలా వేయడం అంత ఈజీ కాదు, బాలీవుడ్‌ కి కాపీ కొట్టడం తప్ప ఏమి రాదు. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికీ ఈ చిత్రం నుంచి ఒక పాట, టీజర్‌ కూడా రిలీజైంది.

 

దీనికి ఊహించినంత రెస్పాన్స్ రాలేదు. తాజాగా రిలీజ్ చేసిన పాటను తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా, మానుషి చిల్లర్ హీరోయిన్లుగా నటిస్తుండగా మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం 2024 ఈద్ సందర్భంగా విడుదల కానుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో మారింది. కాగా చంద్రబోస్ రాశారు. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ కలిసి పాడిన ఈ పాటకి ఎమ్ఎమ్ కీరవాణి మ్యూజిక్ అందించారు. దేశంలోని మారు మూల పల్లెల నుంచి ఆస్కార్ స్టేజ్ వరకూ ప్రతి ఒక్కరినీ ఒక ఊపు ఊపేసింది ఈ పాట.