లోకనాయకుడు , యూనివర్సల్ స్టార్ గా కమల్ హాసన్ (Kamal Hasan ) ఎంతో గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ..ఆయన కూతుళ్లు మాత్రం ఆ రేంజ్ లో గుర్తింపు కాదు కదా..కనీసం క్రేజీ హీరోయిన్స్ గా కూడా గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నారు. ముఖ్యంగా పెద్ద కూతురు శృతి హాసన్ (Sruthi Hasan ) కు మంచి ఛాన్సులు వస్తున్నప్పటికీ వాటిని వాడుకోవడం లో నిర్లక్ష్యం వహిస్తుంది. దీంతో ఆమె వెనుక వచ్చిన భామలంతా టాప్ హీరోయిన్స్ గా చెలామణి అవుతూ..కోట్ల పారితోషకం దక్కించుకుంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక రెండో కూతురు అక్షర (Akshara Haasan) కూడా పెద్దగా సినిమాల ఫై ఫోకస్ పెట్టలేకపోతుంది. దీంతో అభిమానులు బాధపడుతున్నారు. కమల్ ఎంత ఉన్నత స్థాయికి వెళ్లిన..ఆయన కూతుళ్లు మాత్రం తండ్రి పేరును నిలబెట్టలేకపోతున్నారని వాపోతున్నారు. ఇదిలా ఉంటె తాజాగా అక్షర రూ.16 కోట్ల తో ముంబై లో కొత్త ఇల్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ముంబైలోని ఖర్ (Khar ) ప్రాంతంలో 2245 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన అపార్ట్‌మెంట్‌ను అక్షర కొన్నారని సమాచారం. ఖర్‌లోని 16వ రోడ్‌లో ఉన్న 15 అంతస్తుల ఏక్తా వెర్వ్ (Ekta Verve on 16th Road in Khar) టవర్‌లోని 13వ అంతస్తులో ఉన్న 1303 నంబర్ ఫ్లాట్‌ను అక్షర హాసన్ కొనుగోలు చేశారట. ఈ ఫ్లాట్ బిల్డప్ ఏరియా 2245 చదరపు అడుగులట. అలాగే, ఈ ఫ్లాట్‌కు అటాచ్డ్ బాల్కనీ కూడా ఉందట. ఈ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ పత్రాల ఆధారంగా మూడు కార్ పార్కింగ్ స్పేసెస్ కూడా ఉన్నాయని అంటున్నారు. బాంద్రాకు చెందిన దంపతుల నుంచి ఈ ఫ్లాట్‌ను అక్షర హాసన్ కొనుగోలు చేశారట. ఈ మేరకు వారి మధ్య అగ్రిమెంట్ జరిగిందని బాలీవుడ్ వర్గాల అంటున్నాయి.
ఇక అక్షర సినిమాల విషయానికి వస్తే..ధనుష్, అమితాబ్ బచ్చన్ నటించిన ‘షమితాబ్’ అనే హిందీ సినిమాతో అక్షర హాసన్ ఇండస్ట్రీ లో అడుగుపెట్టింది. అయితే, తమిళ సినిమా ‘వివేగం’తో అక్షరకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో అజిత్‌తో కలిసి కీలక పాత్రలో అక్షర నటించారు. ఆ తరవాత విక్రమ్ హీరోగా వచ్చిన ‘కదరం కొండన్’ సినిమాలో నటించారు. అక్షర చివరిగా కిందటేడాది లేడీ ఓరియెంటెడ్ తమిళ మూవీ ‘అచ్చం మేడమ్ నానమ్ పయిరిప్పు’ సినిమాలో కనిపించింది.
Read Also : R Narayana Murthy : కేసీఆర్ భోళా శంకరుడు అంటూ పీపుల్స్ స్టార్ ప్రశంసలు