Site icon HashtagU Telugu

Shiva Movie : నాగార్జున శివ మూవీ ఏఎన్నార్‌కి నచ్చలేదట.. అసలు ఆ కథ ఎలా ఒకే చేశావు అంటూ..

Akkineni Nageswara Rao not Impressed with Shiva Movie story he scolds Nagarjuna for saying ok to Shiva Movie

Akkineni Nageswara Rao not Impressed with Shiva Movie story he scolds Nagarjuna for saying ok to Shiva Movie

రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) దర్శకుడిగా పరిచయం అవుతూ నాగార్జునతో (Nagarjuna) తెరకెక్కించిన యాక్షన్ మూవీ ‘శివ'(Shiva). ఈ చిత్రం తెలుగు సినిమాని మాత్రమే కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ దారినే మార్చేసింది. అప్పటివరకు ఒక పద్ధతిలో వెళ్లిన సినీ పరిశ్రమ.. శివ తరువాత సినిమా కథలలో రంగులు మార్చుకుంది. అయితే ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఈ మూవీ స్టోరీని విన్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావుకి(Akkineni Nageswara Rao) నచ్చలేదట. అసలు ఈ కథని ఎలా ఒకే చేశావు అంటూ నాగార్జునని నిలదీశారు కూడా. ఈ విషయాన్ని అక్కినేని కుటుంబసభ్యురాలు సుప్రియ యార్లగడ్డ (Supriya Yarlagadda) ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.

శివ సినిమాని ఒక కథగా వింటే.. అది అన్ని నార్మల్ స్టోరీలు లాగానే కనిపిస్తుంది. కానీ ఆ నార్మల్ స్టోరీని ఆర్జీవీ స్క్రీన్ పై ప్రెజెంట్ చేసిన విధానం అందర్నీ కట్టిపడేసింది. హీరో సైకిల్ చైన్ తెంచడం, రౌడీని చంపి వాడిని భుజాన వేసుకొని విలన్ డెన్‌కే వెళ్లడం.. ఇలాంటి హీరో ఎలివేషన్స్ షాట్స్ ఎన్నో ఆడియన్స్ ని ఆశ్చర్యపరిచాయి. అప్పటి వరకు తెలుగు సినిమాలోనే కాదు ఇండియన్ ఫిలిం కెరీర్ లోనే అలాంటి హీరోయిజం చూడలేదు. ఇప్పటికి కూడా ఈ మూవీలోని హీరోయిజం సీన్స్ రెఫెరెన్స్ తో పలు చిత్రాలు ఆడియన్స్ ముందుకు వస్తుంటాయి.

కాగా ఆ చైన్ సీన్, విలన్ డెన్‌కి వెళ్లిన సీన్స్ ఎవరైనా ఎలా చెబుతారు. ఈ ఎమోషన్ సీన్ తరువాత హీరో, విలన్ మధ్య ఒక ఫైట్ అని చెప్పేస్తారు తప్ప.. ఎలివేషన్స్ సీన్స్ ని పెద్దగా చెప్పారు కదా. ఈక్రమంలోనే ఆర్జీవీ స్టోరీ చెప్పినప్పుడు కూడా నార్మల్ గా ఎటువంటి ఎలివేషన్స్ లేకుండా ఏఎన్నార్ కి కథని వినిపించేశాడు. ఇక ఆ కథ విన్న నాగేశ్వరరావుకి.. అందులో పెద్ద కొత్త ఏముంది..? అనిపించిందట. కానీ స్క్రీన్ పై RGV చూపించిన విధానానికి ఏఎన్నార్ షాక్ అయ్యారట.

 

Also Read : Pawan OG Story : ‘OG’ స్టోరీ చెప్పేసిన IMDB ..