Site icon HashtagU Telugu

Akkineni Nagarjuna: బాలీవుడ్ స్టార్ హీరోతో మన్మధుడు

Nagarjuna Akshay Kumar

Nagarjuna Akshay Kumar

Akkineni Nagarjuna: నా సామిరంగ’ చిత్రంతో హిట్‌ కొట్టారు కింగ్‌ నాగార్జున. అయితే నా సామిరంగా కంటే ముందు తమిళ దర్శకుడు చెప్పిన కథకు నాగ్‌ ఓకే చెప్పారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ కథ ఓ మల్టీస్టారర్‌గా రూపొందనుందని టాక్‌.

నాగార్జున ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ ధనుష్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీని శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నారు. ముంబాయి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ సినిమాలో నాగ్ ముంబాయి డాన్ గా కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. ధనుష్ కి జంటగా రష్మిక నటిస్తోన్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో పాటు నాగార్జున కోలీవుడ్ డైరెక్టర్ నవీన్ తో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పారని ఓ వార్త బయటకు వచ్చింది. ఇందులో ఓ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ని కాంటాక్ట్ చేస్తున్నారని తెలిసింది. ఇది నెగిటివ్ రోల్ అని టాక్. నాగ్, అక్షయ్ కలిసి అంగారే అనే బాలీవుడ్ మూవీలో నటించారు. ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. నాగ్ నార్త్ ఆడియన్స్ కి బాగా తెలుసు.. అలాగే అక్షయ్ సౌత్ ఆడియన్స్ కి తెలుసు. పైగా ఇటీవల నాగార్జున బ్రహ్మాస్త్ర సినిమాతో నార్త్ ఆడియన్స్ ని మరోసారి ఆకట్టుకున్నారు.

అక్షయ్ ఓకే అంటే.. ఇది మల్టీస్టారర్ మూవీగా, పాన్ ఇండియా మూవీగా మారుతుంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వర్క్ జరుగుతోందని తెలిసింది. మరో విశేషం ఏంటంటే.. ఈ సినిమాను నాగార్జున వందో సినిమాగా ప్రకటించే ఛాన్స్ ఉందని టాక్ బలంగా వినిపిస్తోంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగి ఈ ప్రాజెక్ట్ ను పాన్ ఇండియా రేంజ్ లో చేస్తే మరింత క్రేజ్ రావడం ఖాయం. మరి.. ఏం జరగనుందో చూడాలి.

Also Read: T20 World Cup: క్రికెటర్లకు తీరని కల.. అదేంటో చూడండి

Exit mobile version