Site icon HashtagU Telugu

Bujji Thalli Song: నాగ చైతన్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. బుజ్జి తల్లి వచ్చేసింది!

Bujji Thalli Song

Bujji Thalli Song

నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇటీవల విడుదల అయ్యి మంచి విజయం సాధించడంతో పాటు 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌ గా నిలిచింది. ఈ మూవీని గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకు చాలా మంది ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. చాలామంది ఈ సినిమాను చూస్తూ ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే.

ముఖ్యంగా ఈ సినిమాలో అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న సాంగ్ బుజ్జి తల్లి. ఈ పాట యూట్యూబ్లో మిలియన్ల కొద్ది వ్యూస్ ని రాబట్టడంతో పాటు రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ పాట యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతోంది. బుజ్జితల్లి అంటూ సాగే లవ్ సాంగ్‌ చైతూ, సాయి పల్లవి ఫ్యాన్స్‌ ను అలరించింది. ఈ ప్రేమకథా చిత్రంలోని ఈ సాంగ్‌ హైలెట్‌ గా నిలిచింది. ఈ పాట యూట్యూబ్‌ లో ఏకంగా 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. తాజాగా ఈ పాట ఫుల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆ ఫుల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వెంటనే బుజ్జి తల్లి ఫుల్ వీడియో సాంగ్ చూసేయండి. ఇకపోతే బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌ గా నిలిచిన తండేల్‌ ఓటీటీ లోనూ సందడి చేయనుంది. మార్చి 7వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు మేకర్స్.