Site icon HashtagU Telugu

Naga Chaitanya: నెట్టింట వైరల్ అవుతున్న నాగ చైతను ఎమోషనల్ వీడియో.. ఏడిపించేసాడుగా!

Naga Chaitanya

Naga Chaitanya

అక్కినేని వారసుడు నాగచైతన్య గురించి మనందరికీ. అక్కినేని నాగార్జున తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. మొదట జోష్ సినిమాతో హీరోగా పరిచయమైన నాగ చైతన్య తొలి సినిమాతోనే యువతకు బాగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత ఏం మాయ చేశావే సినిమాతో సూపర్ హిట్ అందుకొని ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. హిట్లు ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు నాగ్ చైతన్య.

చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు నాగ చైతన్య. మజిలీ, లవ్ స్టోరీ లాంటి సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసాడు. ఇటీవలే దూత అనే వెబ్ సిరీస్ కూడా చేశాడు నాగ చైతన్య. ప్రస్తుతం తండేల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇకపోతే నాగచైతన్య వ్యక్తిగత విషయాలు గురించి కూడా మనందరికీ తెలిసిందే. అతను హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకోవడం, తర్వాత విడాకులు తీసుకుని విడిపోవడం ఇవన్నీ మనకు తెలిసిన సంగతులు. ఇదిలా ఉంటే నాగ చైత్యనకు సంబందించిన ఒక ఎమోషనల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

ఈ వీడియోలో నాగ్ చైతన్య చెప్పిన మాటలు మనసుకు హత్తుకుంటున్నాయి. ఈ వీడియోలో నాగ చైతన్య మాట్లాడుతూ.. గాయపడిన మనసు ఒక మనిషిని ఎంత దూరమైన తీసుకెళ్తుంది. ఎవరికైనా ఆ ఎమోషన్ అర్ధమవుతుంది. మన ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీకైనా ఏదైన జరిగితే మన లోపల ఉండే ఫైర్ వేరే ఉంటుంది. ఆ టైం లో మనం రియాక్ట్ అయినప్పుడు చాలా జన్యున్ గా రియాక్ట్ అవుతాం.. ఒక ఇంటెన్సిటీ తో రియాక్ట్ అవుతాం అంటూ తెలిపారు నాగ చైతన్య. ఈ ఎమోషనల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోని చూసిన నెటిజన్స్ ఏడిపించేసావు కదా భయ్యా అంటూ కామెంట్ చేస్తున్నారు.