Site icon HashtagU Telugu

KA : క దర్శకులతో అక్కినేని హీరో..?

Akkineni Hero With Ka Directors

Akkineni Hero With Ka Directors

కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా తెరకెక్కిన క సినిమాను దర్శకత్వం వహించారు అన్నదమ్ములు సుజిత్, సందీప్. ఇద్దరు కలిసి ఒక సినిమాను డైరెక్ట్ చేయడం చాలా అరుదు. ఇద్దరి ఆలోచనలు అలా సింక్ అవ్వడం చాలా కష్టం కానీ. క దర్శకులు అది సాధ్యమయ్యేలా చేశారు. అంతేకాదు సినిమాను కూడా సూపర్ హిట్ అయ్యేలా చేశారు. క (KA) సినిమాతో కిరణ్ అబ్బవరం హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. క సినిమాను రాసుకున్న కథకు పర్ఫెక్ట్ టేకింగ్ తో ఆడియన్స్ ని మెప్పించేలా చేశారు.

ఐతే ఒక సినిమా హిట్ పడితే ఆ మేకర్స్ కు మంచి ఆఫర్లు వస్తాయి. ఈ క్రమంలోనే క సినిమాను అంత ఎంగేజింగ్ గా తెరకెక్కించిన ఈ దర్శకులకు ఆఫర్లు వస్తున్నాయట. క రిజల్ట్ చూసిన నాగ చైతన్య వారితో పనిచేయడానికి రెడీ అనేస్తున్నాడట. ఐతే క సీక్వెల్ గా క 2 ని కూడా ప్లాన్ చేస్తున్నారు. సో నెక్స్ట్ క 2 మీద వారి ఫోకస్ ఉండే ఛాన్స్ ఉంది.

నెక్స్ట్ క 2 చేస్తారా..

క మేకర్స్ నెక్స్ట్ క 2 చేస్తారా లేదా నాగ చైతన్య (Naga Chaitanya)తో సినిమా చేస్తారా అన్నది చూడాలి. క తో సూపర్ హిట్ అందుకున్న ఈ దర్శకులకు కచ్చితంగా మంచి అవకాశలు వస్తాయని చెప్పొచ్చు. క సినిమా తో కిరణ్ కు సూపర్ హిట్ ఇచ్చిన ఈ దర్శకులు నెక్స్ట్ నాగ చైతన్యకు ఎలాంటి సినిమా అందిస్తారన్నది చూడాలి.

ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాలో చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.

Also Read : Thandel – Bujji Thalli : ‘తండేల్’ నుండి బుజ్జితల్లి సాంగ్ వచ్చేసిందోచ్