Site icon HashtagU Telugu

Akkineni Hero : అక్కినేని హీరో మళ్లీ అదే రిస్క్..!

Akkineni Hero Doing Same Mi

Akkineni Hero Doing Same Mi

అక్కినేని (Akkineni) యువ హీరో అఖిల్ కెరీర్ ఏమాత్రం సంతృప్తికరంగా లేదు మొదటి సినిమా అఖిల్ నుంచి రీసెంట్ గా వచ్చిన ఏజెంట్ వరకు అఖిల్ చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా వర్క్ అవుట్ అవ్వట్లేదు. స్టార్ లెగసీ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా అఖిల్ మొదటి సినిమా నుంచే ఫ్యాన్స్ ని ఏర్పరచుకున్నా సినిమాలను కమర్షియల్ హిట్ అందుకోవడంలో మాత్రం వెనకపడి ఉన్నాడు. మధ్యలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ఒక్కటి గట్టేక్కింది మిగతా సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.

ఏజెంట్ ఇచ్చిన షాక్ నుంచి బయటకు వచ్చిన అఖిల్ (Akhil) హిట్లు ఫ్లాపులు ఈ ఇండస్ట్రీలో కామన్ అనుకున్నాడు. తన నెక్స్ట్ సినిమా యువి క్రియేషన్స్ బ్యానర్ లో చేయబోతున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాను నూతన దర్శకుడు డైరెక్ట్ చేస్తాడని టాక్. అంతేకాదు ఈ సినిమా ఒక పీరియాడికల్ మూవీగా వస్తుందని సినిమాకు 100 కోట్ల దాకా బడ్జెట్ పెట్టేస్తున్నారని తెలుస్తుంది. అఖిల్ కెరీర్ లో మొదటి సినిమా అఖిల్ నుంచి ఏజెంట్ వరకు ప్రతి సినిమాకు అతని మార్కెట్ తో సంబంధం లేకుండా భారీ బడ్జెట్ పెట్టారు.

ఏజెంట్ సినిమా అయితే దాదాపుగా 70 నుంచి 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారని టాక్. ఎంత అక్కినేని ఫ్యాన్ బేస్ ఉన్నా సరే అఖిల్ రేంజ్ కి అంత బడ్జెట్ రిక్వర్ అవడం కష్టం సినిమా సెన్సేషనల్ హిట్ అయితే తప్ప అది జరగదు. అయినా కూడా Akkineni అఖిల్ నెక్స్ట్ సినిమాకు నిర్మాతలు 100 కోట్ల దాకా బడ్జెట్ పెట్టేస్తున్నారట. సబ్జెక్ట్ మీద ఉన్న నమ్మకంతో బడ్జెట్ కేటాయిస్తున్నారని అంటున్నారు.

ఈ సినిమాకు ధీర టైటిల్ పరిశీలణలో ఉంది. మరి అఖిల్ ధీర అయిబ్నా సరే అతనికి హిట్ ట్రాక్ ఎక్కేలా చేస్తుందా లేదా అన్నది చూడాలి. అఖిల్ ధీర సినిమా గురించి మిగతా డీటైల్స్ త్వరలో బయటకు రానున్నాయి.

Also Read:  King Nag: యాక్షన్ ఎపిసోడ్‌తో నాగ్ ‘నా సామి రంగ’ షూట్ షురూ