Site icon HashtagU Telugu

Chaitu – Shobitha : వేణు స్వామి కనిపిస్తే చెప్పుతో కొడతామంటున్న అక్కినేని ఫ్యాన్స్

Venu Chaitu

Venu Chaitu

ఈ మధ్య ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి (Astrologer Venuswami) నిత్యం వివాదాల్లో కేరాఫ్ గా నిలుస్తున్నాడు. సినీ ప్రముఖుల తాలూకా జ్యోతిష్యం (Astrology ) చెపుతూ గుర్తింపు తెచ్చుకున్న వేణు..ఆ తర్వాత ఆయన చెప్పిన జాతకాలలో కొన్ని నిజం కాగా చాలావరకు అబద్దం అయ్యాయి. అయినప్పటికీ ఈయన పేరు ఏదో రకంగా వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా చిత్రసీమ (Film Industry )కు సంబదించిన నటి నటులతో పరిచయాలు..వారిచేత పూజలు చేయించడం..వారి జాతకాలను తెలియజేస్తుండడం తో సినీ లవర్స్ ఎక్కువగా ఈయన్ను ఫాలో అవుతూ..ఈయన చేసిన కామెంట్స్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తుంటారు. ఈ మ‌ధ్య ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల‌లో జ‌గ‌న్ గెలుస్తాడ‌ని చెప్పి బొక్కబోర్లా పడ్డాడు. దీంతో ఆయ‌న‌పై విప‌రీతంగా ట్రోల్స్ వ‌చ్చాయి. ఇక ట్రోల్స్‌ని త‌ట్టుకోలేని వేణుస్వామి ఇక‌పై తాను ఎవ‌రి జాత‌కం చెప్ప‌న‌ని ప్ర‌క‌టించాడు. దీంతో ఈ వివాదం స‌ద్దుమ‌ణిగింది. అయితే తాజాగా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల (Chaitu – Shobitha Engagement) జంట‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు.

We’re now on WhatsApp. Click to Join.

నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల జాత‌కం క‌ల‌వ‌లేద‌ని అలాగే వాళ్లిద్ద‌రు ఎంగేజ్‌మెంట్ చేసుకున్న స‌మ‌యం క‌రెక్ట్ కాద‌ని వేణు స్వామి వెల్ల‌డించాడు. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి చేసుకున్న అనంత‌రం ఒక అమ్మాయి వ‌ల‌న 2027లో విడిపోతార‌ని ప్ర‌క‌టించాడు. అయితే వారిద్ద‌రూ క‌లిసి ఉండాలని తన జోతిష్యం త‌ప్పుకావ‌ల‌ని వేడుకుంటున్న‌ట్లు వేణు స్వామి తెలిపాడు. శోభిత జాతకాన్ని బాగా పరిశీలించానని, ఆమె జాతకం అసలు బాగోలేదని తేల్చేశారు. వీరికి నిశ్చితార్థం జరిగిన సమయం, ముహూర్తం, పుట్టిన నక్షత్రం ప్రకారం నాగచైతన్య-శోభిత కలిసివుండరని, విడిపోతారని చెప్పారు. నిశ్చితార్థం గురువారం ఉదయం 9.42 గంటలకు జరిగిందని, ఈ ముహూర్తం ఎలాంటిది అని అడిగితే ఎవరైనా చెబుతారని వేణుస్వామి వ్యాఖ్యానించారు. నాగచైతన్యది కర్కాటక రాశి అని, శోభితది ధనుస్సు రాశి అని, చైతూకు ఆరు, శోభితకు ఎనిమిది వచ్చాయని దీనివల్ల ఇద్దరి జాతకాల్లో షష్టకాలు వచ్చాయన్నారు. చైతూకు, సమంతకు తాను 100కు 50 మార్కులిస్తానని, అదే చైతూకు, శోభితకు అయితే కేవలం 100కు 10 మార్కులిస్తానన్నారు. 50 మార్కులిచ్చిన సమంత విషయంలో ఏం జరిగిందో అందరూ చూశారని, పది మార్కులిచ్చిన శోభిత విషయంలో ఏం జరగబోతుందో అర్థం చేసుకోవాలన్నారు. వేణు వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేణుస్వామి కనిపిస్తే చెప్పుతో కొడతామంటూ సోషల్ మీడియా వేదికగా హెచ్చరిస్తున్నారు.

Read Also : Mohammed Shami: జ‌ట్టులోకి టీమిండియా స్టార్ బౌల‌ర్‌..?!