Site icon HashtagU Telugu

Akkineni Upcoming Movies: 2024 లో అక్కినేని సినిమాల జోరు

Akkineni Upcoming Movies

Akkineni Upcoming Movies

Akkineni Upcoming Movies: టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టాడు. దీంతో సంక్రాంతికి హిట్ ఫ్రీక్ ని మరోసారి మైంటైన్ చేశాడు. నా సామి రంగ సినిమా తక్కువ థియేటర్స్ లోనే రిలీజ్ చేశారు. గుంటూరు కారం, హనుమాన్, సైన్ధవ చిత్రాలతో నాగ్ సినిమా విడుదలైంది. అయితే నాలుగు చిత్రాలకు ధియేటర్స్ కష్టం కాబట్టి నా సామిరంగాను తక్కువ స్క్రీన్ లలోనే విడుదల చేశారు. అయినప్పటికీ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యింది. డిస్ట్రిబ్యూటర్స్ కు మంచి లాభాలు తీసుకువచ్చింది.

గత కొంత కాలంగా నాగార్జున నుంచి ఆశించిన చిత్రాలు రాలేదు. వైల్డ్ డాగ్, ది ఘోస్ట్ చిత్రాలతో వరుస ఫ్లాపుల్లో ఉన్న నాగార్జునకు నా సామి రంగ చిత్రం మంచి ఊపు తీసుకువచ్చింది. ఇక నెక్ట్స్ మూవీస్ విషయానికి వస్తే.. కోలీవుడ్ స్టార్ ధనుష్ మూవీలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. త్వరలో నాగ్ ఈ మూవీ షూట్ లో జాయిన్ కానున్నారు.

అలాగే నెట్ ఫ్లిక్స్ కోసం ఓ భారీ స్పై థ్రిల్లర్ మూవీ చేస్తున్నారు. ఆతర్వాత బంగార్రాజు సీక్వెల్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. ఇక నాగచైతన్య విషయానికి వస్తే.. ప్రస్తుతం తండేల్ అనే సినిమా చేస్తున్నాడు. చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

చైతన్య కెరీర్ లోనే ఇది భారీ చిత్రం. యధార్థ సంఘటనలు ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇక అఖిల్ విషయానికి వస్తే.. యు.వీ క్రియేషన్స్ బ్యానర్ లో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. భారీ సోషియో ఫాంటసీ మూవీగా రూపొందే ఈ సినిమాను త్వరలో సెట్స్ పైకి తీసుకురానున్నారు. ఈ చిత్రాన్ని అనిల్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నాడు. మొత్తానికి 2024 అక్కినేని ఫ్యాన్స్ కు మంచి జోష్ అందించింది.

Also Read: IND vs ENG 1st Day: తొలిరోజు ముగిసిన ఆట‌.. టీమిండియాదే పైచేయి