నాగ చైతన్య – సమంత ( Naga Chaitanya – Samantha Divorce ) విడిపోవడానికి కేటీఆర్ (KTR) కారణమంటూ అంటూ సురేఖ ( Konda Surekha) చేసిన వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యామిలీ (Akkineni Family) సభ్యులు ఘాటుగా స్పందించారు.
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) : గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను.
అక్కినేని అమల (Akkineni Amala) : ‘మంత్రి వ్యాఖ్యలు విని షాక్కు గురయ్యా. రాజకీయ వివాదాల్లోకి మమ్మల్ని లాగవద్దు. నా భర్త గురించి నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. రాజకీయ నాయకులే నేరస్థుల్లా ప్రవర్తిస్తే ఈ దేశం ఏమైపోతుంది? సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పేలా రాహుల్ గాంధీ చొరవ తీసుకోవాలి’ అని ఆమె ట్వీట్ చేశారు.
నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) : చైతు ప్రత్యేకంగా ట్వీట్ చేయకపోయినా, తన తండ్రి నాగార్జున చేసిన ట్వీట్ నే రీట్వీట్ చేశారు. గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను’ అంటూ నాగార్జున తెలిపిన ట్వీట్ నే చైతు తెలిపాడు.
సమంత (Samantha): తనను రాజకీయాల్లోకి లాగొద్దని కోరారు. ‘మహిళల్ని వస్తువుల్లా చూసే ఈ గ్లామర్ పరిశ్రమలో పనిచేయడం, ప్రేమలో పడటం, నిలబడి పోరాడటానికి చాలా శక్తి కావాలి. నా ప్రయాణాన్ని చిన్నచూపు చూడొద్దు. ఇక విడాకులనేవి పూర్తిగా నా వ్యక్తిగత విషయం. అది ఇద్దరి అంగీకారంతో, ఎటువంటి రాజకీయ కుట్ర లేకుండా జరిగింది. దయచేసి నా పేరును రాజకీయాలకు దూరం పెట్టండి’ అని ఓ ప్రకటనలో సూచించారు.
చిత్రసీమ ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు.
సినీ నటి , మాజీ మంత్రి రోజా (RK Roja) : అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై, సమంతపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని వైసీపీ నేత రోజా అన్నారు. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ‘కొండా సురేఖపై బీఆర్ఎస్ నేతల పోస్టులను అందరూ వ్యతిరేకించారు. కానీ తోటి మహిళపై హేయమైన వ్యాఖ్యలు చేయడానికి సురేఖకు మనసు ఎలా వచ్చింది? మీ రాజకీయ వివాదాల్లోకి మహిళను తీసుకురావడం దుర్మార్గం’ అని ఆమె పేర్కొన్నారు.
చిన్మయి (Chinmayi) : కొందరు మైలేజ్ కోసం సమంత పేరును వాడుకుంటున్నారంటూ సమంత విడాకుల గురించి మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ ఫై సింగర్ చిన్మయి పరోక్షంగా స్పందించారు. సమంత విషయంలో యూట్యూబ్ ఛానళ్లు, మీడియా సంస్థల తీరునూ ఆమె తప్పుబట్టారు. వ్యూస్, లైక్స్, డబ్బు కోసం ఇలా చేయడం బాధాకరమన్నారు.
ప్రకాష్ రాజ్ (Prakash Raj) : ‘ఏంటీ సిగ్గులేని రాజకీయాలు.. సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్నచూపా..? అంటూ ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అటు బిఆర్ఎస్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరోపణలు ఎదురుకుంటున్న కేటీఆర్ సైతం సురేఖ కు లీగల్ నోటీసులు పంపించారు.
అసలు కొండాసురేఖ ఏమన్నదంటే..
నాగ చైతన్య – సమంత (Naga Chaitanya – SamanthaDivorce) విడిపోవడానికి కారణం కేటీఆర్ అని , N కన్వెన్షన్ కూల్చకుండా ఉండాలంటే సమంత ను తన దగ్గరికి పంపాలని కేటీఆర్ డిమాండ్ చేయడం తో.. నాగార్జున (Nagarjuna)..సమంత ను కేటీఆర్ దగ్గరికి వెళ్లాలని ఫోర్స్ చేసాడు..కానీ సమంత ఒప్పుకోలేదు…అలాంటి పని చేయనంటే..చేయనని తేల్చి చెప్పడం తో..కుటుంబంలో గొడవలు జరిగాయి. కేటీఆర్ దగ్గరికి వెళ్లకపోతే మా ఇంట్లో ఉండొద్దని నాగార్జున తెచ్చి చెప్పడంతో..ఆ పని చేయలేక సమంత విడాకులు తీసుకుంది. నాగ చైతన్య – సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే అని తేల్చి చెప్పింది. రకుల్ ప్రీతీ సింగ్ త్వరగా పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా కేటీఆరే అని పలువురు హీరోయిన్స్ కు మత్తుమందు అలవాటు చేసింది కేటీఆరే అని సురేఖ తెలిపింది.
Read Also : Konda Surekha Comments : దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి – చైతు