Naga Chaitanya Shobhita అక్కినేని ఫ్యామిలీ గురించి మీడియాలో రకరకాల వార్తలు ఎప్పుడూ స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి. సర్ ప్రైజ్ గా అఖిల్ ఎంగేజ్మెంట్ విషయమై కింగ్ నాగార్జున చేసిన మెసేజ్ తెలిసిందే. అఖిల్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఐతే అఖిల్ (Akhil) పెళ్లి నాగ చైతన్య, శోభితలతో జరుగుతుందా లేదా అన్న దానిపై క్లారిటీ లేదు. ఇదిలాఉంటే నాగ చైతన్య, శోభిత ల మ్యారేజ్ వీడియోని నెట్ ఫ్లిక్స్ కు 50 కోట్లకు అమ్మినట్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ గా మారింది.
ఐతే దీనిపై అక్కినేని కాంపౌండ్ నుంచి క్లారిటీ వచ్చింది. నాగ చైతన్య (Naga Chaitanya), శోభిత మ్యారేజ్ వీడియోని ఎవరికీ అమ్మలేదని. అది ప్రైవేట్ గా జరుగుతుందని. దాన్ని ఎవరికీ అమ్మట్లేదని స్పష్టం చేశారు. నాగ చైతన్య, శోభిత డిసెంబర్ 4న ఒకటి కాబోతున్నారు. ఈ వివాహ వేడుకకు సంబందించిన వీడియో రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ (Netflix) కు అమ్మేసినట్టు చెప్పుకుంటున్నారు.
మ్యారేజ్ పై వస్తున్న వార్తలన్నీ..
అక్కినేని టీం ఈ వార్తలను ఖండించింది. చైతన్య మ్యారేజ్ పై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని.. ఈ వీడియో రైట్స్ ఎవరికీ ఇవ్వలేదని వెల్లడించారు. నాగ చైతన్య, శోభిత (Shobhitha) పెళ్లి పనులు మొదలయ్యాయి. వీరి పెళ్లికి టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉంది.
నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా చేస్తున్నాడు. చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
Also Read : Roja : అలాంటి పాత్రలైతే చేస్తానంటున్న రోజా..!