Akkineni Akhil : వామ్మో.. ఏజెంట్ ప్రమోషన్స్ కోసం 170 అడుగుల మీద నుంచి దూకిన అఖిల్..

ఏజెంట్ చిత్రయూనిట్ ప్రమోషన్స్ మాత్రం సరికొత్తగా చేస్తున్నారు. తాజాగా విజయవాడలో ఏజెంట్ ప్రమోషన్స్ నిర్వహించారు.

Published By: HashtagU Telugu Desk
Akkineni Akhil Jumping From 172 feet for Agent Promotions

Akkineni Akhil Jumping From 172 feet for Agent Promotions

అఖిల్(Akhil) హీరోగా, సాక్షి వైద్య(Sakshi Vaidya) హీరోయిన్ గా, మళయాలం స్టార్ మమ్ముట్టి(Mammootty) ముఖ్య పాత్రలో సురేందర్ రెడ్డి(Surendar Reddy) దర్శకత్వంలో ఏజెంట్(Agent) సినిమా గ్రాండ్ గా తెరకెక్కుతుంది. అనిల్ సుంకర నిర్మాణంలో భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా అఖిల్ ఈ సినిమాలో పూర్తిగా మాస్, యాక్షన్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

దీంతో చిత్రయూనిట్ ఇటీవలే ప్రమోషన్స్ ని మొదలుపెట్టారు. ఇప్పటికే ఏజెంట్ సినిమా నుంచి రిలీజయిన టీజర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్కినేని అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఏజెంట్ చిత్రయూనిట్ ప్రమోషన్స్ మాత్రం సరికొత్తగా చేస్తున్నారు. తాజాగా విజయవాడలో ఏజెంట్ ప్రమోషన్స్ నిర్వహించారు. విజయవాడ PVP మాల్ వద్ద ఏజెంట్ ప్రమోషన్స్ కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి అఖిల్ 172 అడుగుల మీద నుంచి కిందకు దిగి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

విజయవాడ PVP మాల్ బిల్డింగ్ పైనుంచి అఖిల్ క్రేన్, తాళ్ల సాయంతో కిందకి దిగాడు. అఖిల్ కిందకు దిగుతుండగా పూల వర్షం కురిపించారు అభిమానులు. దీంతో అఖిల్ ఈ రిస్క్ చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. సినిమాలో కాదు కేవలం ప్రమోషన్స్ కోసం అఖిల్ ఇలాంటి రిస్క్ చేసారంటే గ్రేట్ అని అభినందిస్తున్నారు. ప్రమోషన్స్ స్టార్టింగ్ లోనే అఖిల్ ఈ రేంజ్ రిస్క్ చేసాడంట మున్ముందు ఇంకెంత కొత్తగా ప్రమోషన్స్ చేస్తారో అఖిల్, చిత్రయూనిట్ కలిసి అని ఆలోచిస్తున్నారు. సినిమా కోసం, ప్రమోషన్స్ కోసం ఇంత రిస్క్ తీసుకుంటున్న అఖిల్ ని అంతా అభినందిస్తున్నారు.

 

Also Read :    Ranbir Kapoor : రణబీర్ మంచి భర్త కాదంట.. అలియా భట్‌తో మ్యారేజిపై రణబీర్ ఏం చెప్పాడో తెలుసా??

  Last Updated: 16 Apr 2023, 07:17 PM IST