Kalki : కల్కి మేనియా లో పవన్ కళ్యాణ్ తనయుడు

పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా సైతం ఉదయమే కల్కి చూసేందుకు హైదరాబాద్ లోని ప్రసాద్స్ కు రావడం జరిగింది

  • Written By:
  • Publish Date - June 27, 2024 / 01:07 PM IST

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కల్కి (kalki 2898 AD ) మేనియా నడుస్తుంది. ఎక్కడ చూసిన..ఏ నోటా విన్న కల్కి పేరే వినిపిస్తుంది. అర్ధరాత్రి నుండే అభిమానులు థియేటర్ల దగ్గర సందడి చేయడం మొదలుపెట్టారు. పెద్ద ఎత్తున బాణాసంచా పేలుస్తూ..భారీ కటౌట్స్ ఏర్పాటు చేస్తూ..ప్రభాస్ కటౌట్ కు పాలాభిషేకం చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. కేవలం ప్రభాస్ అభిమానులే కాదు పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం కల్కి మేనియా లో జాయిన్ అవుతూ ప్రభాస్ ఫ్యాన్స్ తో సందడి చేస్తున్నారు.

కల్కి మూవీ రిలీజ్ సందర్భంగా విజయవాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కట్టిన ఫ్లెక్సీలు ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫ్లెక్సీలో డిప్యూటీ సీఎం గారి తాలుకా అని రాసి ఉంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అలాగే పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా (AKira) సైతం ఉదయమే కల్కి చూసేందుకు హైదరాబాద్ లోని ప్రసాద్స్ కు రావడం జరిగింది.

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈ కల్కి 2898 AD తెరకెక్కింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణె, దిశా పటాని, యూనివర్స్ స్టార్ కమల్ హాసన్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నటి శోభన, మాళవిక నాయర్ ఇలా ఎంతో మంది ఈ మూవీ లో నటించి మెప్పించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు వారి అనుభూతిని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. అలాగే సినిమాలోని హైలైట్స్ ను తమ ఫోన్ లలో చిత్రీకరించి..సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తుండడం తో సినిమా చూడని వారికీ..చూడాలంటే ఆత్రుత కల్పిస్తున్నారు. విడుదలైన ప్రతి చోట సినిమా కు బ్లాక్ బస్టర్ టాక్ రావడం తో అభిమానులు, మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సందర్బంగా సెన్సార్ బోర్డ్ మెంబర్‌ ఉమైర్ సంధు ఫై ఓ రేంజ్ లో బూతులు తిడుతూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. అసలు వీడు ఏ సెన్సార్ బోర్డ్‌కి మెంబరో.. వీడికెవరు సినిమాలు చూపిస్తారో తెలియదు కానీ.. ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే.. రెండు మూడు వారాల ముందే ఆ సినిమాకి రివ్యూ ఇచ్చేస్తాడు. ముఖ్యంగా తెలుగులో హై బడ్జెట్ మూవీ వస్తుందంటే అందులోనూ ప్రభాస్ సినిమా అంటే ముందే విషం కక్కుతాడు.

We’re now on WhatsApp. Click to Join.

సినిమా అలా ఉంది.. ఇలా ఉంది.. అక్కడ బాలేదు.. ఇక్కడ బాలేదు అంటూ నోటికొచ్చింది పేలి తప్పడు రివ్యూలు ఇస్తుంటాడు. బాగున్న సినిమాని బాలేదని.. బాలేని సినిమాని బాగుందని నోటికొచ్చింది కూసి.. ట్విట్టర్‌లో ట్రెండింగ్ అవుతుంటాడు. అజ్ఞాతవాసి, స్పైడర్, నా పేరు సూర్య, సాహో లాంటి అట్టర్ ఫ్లాప్ సినిమాలను అద్భుతం అంటూ పొగిడిన ఈ ఫేక్ గాడు.. తాజాగా ‘కల్కి’ సినిమాపై విషం కక్కుతూ నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : USA Vs Pak : పాక్‌కు షాక్.. ఎన్నికలపై దర్యాప్తు కోరుతూ అమెరికా తీర్మానం