Akira Nandan : ఎన్టీఆర్, బన్నీ పై పవన్ కొడుకు అకిరా వీడియో ఎడిట్స్ చూసారా..?

ఎన్టీఆర్, బన్నీ పై పవన్ కొడుకు అకిరా వీడియో ఎడిట్స్ చూసారా..? 'అరవింద సమేత వీర రాఘవ' ఎన్టీఆర్‌తో..

  • Written By:
  • Publish Date - June 6, 2024 / 05:02 PM IST

Akira Nandan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ గురించి టాలీవుడ్ ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగా అభిమానులతో పాటు టాలీవుడ్ ఆడియన్స్ సైతం.. ఈ వారసుడి ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే అకిరా తన తెరంగేట్రాని ఎలా ప్లాన్ చేస్తున్నాడు అనేది క్లారిటీ లేదు. అకిరా హీరోగా ఎంట్రీ ఇస్తాడని అందరూ ఆశ పడుతుంటే.. అకిరా మాత్రం మ్యూజిక్, ఎడిటింగ్, ప్రొడక్షన్ పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు.

అకిరా మ్యూజిక్ ప్లే చేస్తున్న కొన్ని వీడియోలు గతంలో చాలా సార్లు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా అకిరా ఎడిట్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తన తండ్రి పవన్ పై ఓ పవర్ ఫుల్ ఎడిటింగ్ ని అకిరా చేసాడు. ఇక ఈ వీడియోని రేణూదేశాయ్.. ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. అందుకు సంబంధించిన యూట్యూబ్ లింక్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.

తండ్రి పై అకిరా ఎడిట్ చూసిన నెటిజెన్స్ ఫిదా అయ్యారు. ఇక ఆ వీడియోతో వచ్చిన ఆసక్తితో.. ఆ యూట్యూబ్ ఛానల్ లో ఉన్న మరిన్ని వీడియోల పై కూడా లుక్ వేశారు. ఆ వీడియోల్లో ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ పై కూడా ఎడిట్స్ ఉన్నాయి. ‘అరవింద సమేత వీర రాఘవ’ ఎన్టీఆర్ తో ఓ బ్యూటిఫుల్ ఎడిట్ ని అకిరా చేసారు. ఇక ఈ ఎడిట్ ని చూసిన ఎన్టీఆర్ అభిమానులు.. ఈ వీడియోని నెట్టింట వైరల్ చేస్తున్నారు.

ఇక అల్లు అర్జున్ ఎడిట్ విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ ‘గుడుంబా శంకర్’ సౌండ్ ట్రాక్ తో అల్లు అర్జున్ ఎడిట్ ని చేసారు. ఆ ఎడిట్ లోని కట్స్ కి బన్నీ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ రెండితో పాటు ఆర్ఆర్ఆర్ మూవీ పై కూడా ఓ ఎడిట్ చేసాడు. ఇక ఆ ఎడిట్ లో రామ్ చరణ్ కట్స్ కి చరణ్ ఫ్యాన్స్ మైమరచిపోతున్నారు. అన్న పై తమ్ముడు ప్రేమ ఎడిటింగ్ తో చుపించాడుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.