Akira Nandan : ‘తమ్ముడు’ రీ రిలీజ్‌లో అకిరా సందడి.. బాబోయ్ ఆ క్రేజ్ ఏంటి..?

'తమ్ముడు' రీ రిలీజ్‌లో పవన్ వారసుడి అకిరా సందడి. బాబోయ్ సినిమాల్లోకి రాకముందే ఆ క్రేజ్ ఏంటి..?

  • Written By:
  • Publish Date - June 15, 2024 / 12:33 PM IST

Akira Nandan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఏ రేంజ్ క్రేజ్ ఉందో సపరేట్ గా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఆయన అభిమానులంతా వారసుడి ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. పవన్ సినిమాలు తగ్గించి పాలిటిక్స్ లో బిజీ అవ్వడంతో.. సినిమా రంగంలో ఆయన స్థానాన్ని ఆయన వారసుడు అకిరా నందన్ భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఇక మొన్నటి వరకు ఆడియన్స్ కి దూరంగా ఉన్న అకిరా.. ఇప్పుడు పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్స్ ఎక్కువ కనిపిస్తూ వస్తున్నాడు.

ఈక్రమంలోనే పవన్ కి సంబంధించిన పలు రీ రిలీజ్ సినిమాలను చూసేందుకు అకిరా థియేటర్స్ కి వస్తున్నాడు. ఇక పవన్ రీ రిలీజ్ సినిమాని చూసేందుకు వెళ్లిన అభిమానులకు.. వారసుడు కనిపిస్తుండడంతో ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు. తాజాగా పవన్ సూపర్ హిట్ మూవీ ‘తమ్ముడు’ రీ రిలీజ్ అయ్యింది. హైదరాబాద్ దేవి థియేటర్ లో ఈ సినిమా రీ రిలీజ్ అవ్వగా.. అకిరా హాజరయ్యాడు. ఇక అకిరా రాకతో థియేటర్ లో అభిమానుల కోలాహలం కనిపించింది.

అకిరాని చూసేందుకు, ఒక ఫోటో తీసుకునేందుకు ఫ్యాన్స్ అంతా తెగ సంబరపడ్డారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఆ వీడియోలు చూస్తుంటే.. ఒక స్టార్ హీరోని చూడడానికి అభిమానులు సంబరపడుతున్నట్లు కనిపిస్తుంది. సినిమాల్లోకి రాకముందే అకిరాకి ఈ రేంజ్ క్రేజ్ అంటూ పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక అకిరా లుక్స్ అండ్ టాలెంట్ ని గమనించిన కొంతమంది అభిమానులు.. త్వరగా హీరోగా ఎంట్రీ ఇస్తే బాగుండు అని ఫీల్ అవుతున్నారు. మరి ఈ పవర్ వారసుడి పవర్ ఫుల్ ఎంట్రీ ఎప్పుడు ఉండబోతుందో చూడాలి.