Akkineni Akhil అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడోతరం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. చేయడానికి ఐదారు సినిమాలు చేసినా ఏది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ఒకటి పర్వాలేదు అనిపించుకుంది. లాస్ట్ ఇయర్ వచ్చిన ఏజెంట్ డిజాస్టర్ అయ్యింది. ఐతే అఖిల్ నెక్స్ట్ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం అఖిల్ సినిమా అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గురువారం ఏఎన్నార్ శతజయంతి సందర్భంగా నాగార్జున (Nagarjuna) ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో అఖిల్ మిస్ అయ్యాడు. హిట్ కొట్టాకే ఫ్యాన్స్ ముందుకు వస్తానని చెప్పాడని నాగార్జున మాట్లాడారు. అంతేకాదు మీ అందరినీ అడిగినట్టు చెప్పమన్నాడని అన్నారు. సో అఖిల్ హిట్ కొట్టాకే ఫ్యాన్స్ ముందు తలెత్తుకు రావాలని అనుకుంటున్నాడని అర్ధమైంది.
లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో అఖిల్..
అఖిల్ తన ప్రతి సినిమాకు తను పెట్టే ఎఫర్ట్స్ బాగున్నా ఎందుకో సినిమాలు వర్క్ అవుట్ కావట్లేదు. ప్రస్తుతం అఖిల్ లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో వెరైటీగా కనిపిస్తున్నాడు. అఖిల్ తో ఒక భారీ సినిమా ప్లానింగ్ లో ఉన్నారని తెలుస్తుంది. యువి క్రియేషన్స్, హోంబలె ప్రొడక్షన్స్ కలిసి ఈ సినిమా నిర్మిస్తాయని టాక్.
ఐతే ఇప్పటివరకు అఖిల్ నెక్స్ట్ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. మరి సినిమా ఎప్పుడు మొదలవుతుంది అన్నది చూడాలి. అఖిల్ మాత్రం ఈసారి ఒక సూపర్ హిట్ కొట్టాకే ఫ్యాన్స్ ముందుకు రావాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది.
Also Read : ANR National Award : చిరంజీవికి ఏఎన్నార్ నేషనల్ అవార్డ్..!