Akhil : అతి త్వరలో కింగ్ నాగార్జున ఇంట పెళ్లి సందడి..?

ఈ మధ్యనే తనతో కలిసి నటించిన ఓ హీరోయిన్ ప్రేమలో పడిపోయాడట. ప్రస్తుతం ఇద్దరు కలిసి పీకల్లోతు ప్రేమలో ఉన్నారని తెలుస్తుంది.

Published By: HashtagU Telugu Desk
Akhil New Movie

Akhil New Movie

అక్కినేని నాగార్జున (Nagarjuna) ఇంట అతి త్వరలో పెళ్లి సందడి మొదలుకాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జున రెండో కుమారుడు అఖిల్ (Akhil)..ఓ ఇంటివాడు కాబోతున్నాడని అంత మాట్లాడుకుంటున్నారు. గతంలో ఓసారి అఖిల్ పెళ్లి పీటల వరకు వెళ్లి ఆ వేడుక రద్దైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సైలెంట్ గా ఉన్న అఖిల్..ఈ మధ్యనే తనతో కలిసి నటించిన ఓ హీరోయిన్ ప్రేమలో పడిపోయాడట. ప్రస్తుతం ఇద్దరు కలిసి పీకల్లోతు ప్రేమలో ఉన్నారని తెలుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

వీరి పెళ్ళికి నాగార్జున సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అన్ని కుదిరితే ఈ ఏడాది లోనే అఖిల్ పెళ్లి ఉండబోతుందని అంటున్నారు. ప్రస్తుతం మాత్రం అఖిల్ ప్రేమిస్తున్న ఆమె పేరును సీక్రెట్ గా ఉంచుతున్నారు. అఖిల్ సినీ కెరియర్ విషయానికి వస్తే..ఇప్పటి వరకు దాదాపు ఐదు , ఆరు సినిమాల్లో నటించినప్పటికీ వాటిలో రెండు మాత్రమే యావరేజ్ అనిపించుకున్నాయి. మిగతావన్నీ డిజాస్టర్స్ గా మిగిలాయి. అఖిల్ ఓ హిట్ కొడితే చూడాలని అభిమానులు , కుటుంబ సభ్యులు ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. కానీ అఖిల్ కెరియర్ లో మాత్రం హిట్ అనేది లేకుండా పోతుంది.

Read Also : Tendulkar : యువ మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాంచీకి టెండూల్కర్

  Last Updated: 20 Apr 2024, 05:09 PM IST