Akhil : లుక్స్ ఓకే కానీ అనౌన్స్ మెంట్ ఎప్పుడు రాజా..?

Akhil అక్కినేని హీరో అఖిల్ ఏజెంట్ రిలీజ్ టైం లో రెగ్యులర్ గా వార్తల్లో ఉండగా ఆఫ్టర్ ఏజెంట్ రిలీజ్ నెక్స్ట్ డే నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఏజెంట్ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు

Published By: HashtagU Telugu Desk
Akhil New Makeover Fans Surprise

Akhil New Makeover Fans Surprise

Akhil అక్కినేని హీరో అఖిల్ ఏజెంట్ రిలీజ్ టైం లో రెగ్యులర్ గా వార్తల్లో ఉండగా ఆఫ్టర్ ఏజెంట్ రిలీజ్ నెక్స్ట్ డే నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఏజెంట్ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు కానీ ఆ సినిమా ఏమాత్రం వర్క్ అవుట్ కాలేదు. సినిమా కోసం అఖిల్ పడిన కష్టమంతా కూడా వృధా అయ్యింది. ఏజెంట్ తర్వాత ఏడాది అవుతున్నా తన నెక్స్ట్ సినిమా అప్డేట్ ఇవ్వలేదు అఖిల్.

అయితే అఖిల్ ఈసారి పక్కా హిట్ టార్గెట్ తో వస్తున్నాడని అంటున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో అఖిల్ సినిమా ఉండబోతుందని టాక్. పీరియాడికల్ కథతో అఖిల్ ఈసారి భారీ ప్లానింగ్ తో వస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా కోసమే అఖిల్ పూర్తిగా మేకోవర్ అవుతున్నాడు. కొద్దిపాటి గ్యాప్ తర్వాత అఖిల్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పొడవైన జుట్టుతో అఖిల్ కొత్త లుక్ అక్కినేని ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. చూస్తుంటే వార్తల్లో వచ్చినట్టుగా పీరియాడికల్ కథకు అఖిల్ తనను తాను సిద్ధం చేస్తున్నట్టుగా ఉన్నాడు. అయితే అఖిల్ లుక్స్ ఓకే కానీ సినిమా అనౌన్స్ మెంట్ ఎప్పుడని ఫ్యాన్స్ అడుగుతున్నారు. అఖిల్ బర్త్ డే రోజు సినిమా ప్రకటన వస్తుందని అనుకోగా అది కూడా మిస్ అయ్యింది.

అఖిల్ నెక్స్ట్ సినిమాపై ఈ సస్పెన్స్ ని అక్కినేని ఫ్యాన్స్ భరించలేకపోతున్నారు. అఖిల్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో నెక్స్ట్ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. మరి అఖిల్ యువి కాంబో ఎలా ఉంటుందో చూడాలి.

Also Read : Parijatha Parvam: క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పారిజాత పర్వం’ ట్రైలర్ రిలీజ్

  Last Updated: 12 Apr 2024, 08:29 PM IST