Site icon HashtagU Telugu

Akkineni Amala: అఖిల్ ‘ఏజెంట్’ పై దారుణంగా ట్రోలింగ్.. తల్లి అమల రియాక్షన్ ఇదే!

Agent

Agent

అఖిల్ (Akhil) అక్కినేని హీరోగా నటించిన మూవీ ఏజెంట్ భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదలైంది. స్టార్ పవర్ ఉన్నప్పటికీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కేవలం రెండు రోజుల్లోనే ఇతర సినిమాలతో పోటీ పడలేక చతికిల పడిపోయింది. అయితే సరైన ఓపెనింగ్ కలెక్షన్స్ లేకపోవడంతో విమర్శలకు, ట్రోలింగ్ కు దారితీసింది. ముఖ్యంగా అఖిల్ పై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘అయ్యాగారూ ఎప్పటికైనా హిట్ కొడతారు’ అంటూ దారుణంగా ట్రోల్స్ (Trolls) చేస్తున్నారు.

ఈ నేపథ్యం అఖిల్ అక్కినేని తల్లి అమల (Akkineni Amala) తన కొడుకు మూవీ ఏజెంట్‌కి మద్దతు ఇచ్చారు. ట్రోల్స్‌పై ఆమె స్పందిస్తూ, సినిమాలో లోపాలున్నాయని, అయితే అఖిల్ బాగా ఎంజాయ్ చేశాడని చెప్పింది. 50 శాతం ఆక్యుపెన్సీ ఉన్న థియేటర్‌లో తాను సినిమా చూశానని, అందులో అత్యధికంగా ఆడవారు ఉన్నారని ఆమె పేర్కొన్నారు.

అమల తన ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) ద్వారా రియాక్ట్ అయ్యింది. “నేను నిన్న ఏజెంట్ చూసాను. సినిమాను పూర్తిగా ఆస్వాదించాను. దాని లోపాలు ఉన్నప్పటికీ, మీరు ఓపెన్ మైండ్‌తో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. 50% మంది ప్రేక్షకులు తమ భర్తలు, కొడుకులతో పాటు తల్లులు, అమ్మమ్మలు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు’’ అని తన కొడుకు అఖిల్ కు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. కాగా ఏజెంట్ విడుదలైన మొదటి రోజు దాదాపు రూ.7 కోట్లు రాబట్టింది. అన్ని భాషల్లో కలిపి రూ.7 కోట్ల కలెక్షన్లు రాబట్టిందని అంచనా. దాదాపు 80 కోట్ల బడ్జెట్‌తో ఏజెంట్‌ను రూపొందించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మినిమమ్ కలెక్షన్లు సాధిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.

Also Read: Adipurush Update: ఆదిపురుష్ నుంచి మరో అప్డేట్, రాముడి రాక కోసం సీత కంటతడి!