Site icon HashtagU Telugu

Akhil Akkineni : హిట్ కోసం అఖిల్ రాజమౌళి హెల్ప్ తీసుకోబోతున్నాడా?

Akhil Akkineni will takes Rajamouli Help for his Next Movie

Akhil Akkineni will takes Rajamouli Help for his Next Movie

అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్(Akhil Akkineni) ఇప్పటి వరకు ఒక్క భారీ విజయం కూడా సాధించలేదు. అఖిల్ కెరీర్ లో ఒక్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్(Most Eligible Bachelor) సినిమా పర్వాలేదనిపించినా మిగిలిన నాలుగు సినిమాలు పరాజయం పాలయ్యాయి. ఇటీవల వచ్చిన ఏజెంట్(Agent) సినిమా అయితే భారీ డిజాస్టర్ చూసింది.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మమ్ముట్టి లాంటి స్టార్ హీరోని పెట్టి స్పై యాక్షన్ థ్రిల్లర్ అని తెరకెక్కించిన ఏజెంట్ భారీ అంచనాలు ఉన్నా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అఖిల్ మార్కెట్ కి మించి ఏజెంట్ సినిమాకు బడ్జెట్ పెట్టడంతో ఈ సినిమాతో నిర్మాతకు దాదాపు 40 కోట్ల నష్టం వచ్చిందని సమాచారం.

ఏజెంట్ సినిమా తర్వాత అధికారికంగా ఏ సినిమా అనౌన్స్ చేయకపోయినా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అనిల్ అనే కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో ఉండబోతుంది. అయితే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఈ సినిమాకు అఖిల్ రాజమౌళి(Rajamouli) హెల్ప్ తీసుకోబోతున్నాడట. అఖిల్ కొత్త సినిమాకు స్క్రిప్ట్ విషయంలో రాజమౌళి, ఆయన తనయుడు కార్తికేయ సహాయం చేయనున్నారని సమాచారం. రాజమౌళి అఖిల్ స్క్రిప్ట్ పై కొన్ని రోజులు వర్క్ చేయబోతున్నాడట. దీంతో రాజమౌళి చెయ్యి పడుతుంది కాబట్టి ఈ సారైనా అఖిల్ హిట్ కొడతాడని భావిస్తున్నారు అభిమానులు.

 

Also Read : Dil Raju: యానిమల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు దిల్ రాజు సొంతం