Akhil Akkineni: అఖిల్ ‘ఏజెంట్’ టీజర్ రెడీ

ప్రామిసింగ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని 'ఏజెంట్' సినిమాతో పాన్ ఇండియాలో అడుగుపెడుతున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Agent

Agent

ప్రామిసింగ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ సినిమాతో పాన్ ఇండియాలో అడుగుపెడుతున్నాడు. స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం ఏకకాలంలో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. ఏజెంట్ టీజర్ జులై 15న విడుదల కానుంది. “ఈ తేదీ తర్వాత పాన్ ఇండియా అంతాట ఎ.. జెంట్ కోసం ఎదురుచూస్తారు. జూలై 15న ఒక వైల్డ్ స్టైల్ వ్యాపించబోతుంది” అని మేకర్స్ ప్రత్యేక వీడియో ద్వారా టీజర్ డేట్ ని ప్రకటించారు.

హై వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అఖిల్ పూర్తిగా మేకోవ‌ర్ అయ్యారు. స్టయిలిష్‌గా చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్సులు ‘ఏజెంట్’కి ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నాయి. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించారు. ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజా సంగీతం అందించగా, రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహకుడిగా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

  Last Updated: 11 Jul 2022, 12:01 PM IST