Site icon HashtagU Telugu

Akhil: ఏజెంట్ సినిమా ఫ్లాప్.. ఒంటరిగా దుబాయ్ కి వెళ్లిపోయిన అఖిల్?

Akhil

Akhil

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటించిన తాజా చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది. కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అయ్యి దారుణంగా డిజాస్టర్ ను చవి చూసింది. ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని అభిమానులు ప్రేక్షకులు భావించారు. అంతే కాకుండా ఈ సినిమాతో అఖిల్ కెరియర్ టర్న్ అవుతుందని కూడా భావించారు.

కానీ ఏజెంట్ సినిమా ఆ అంచనాలను అందుకోలేకపోయింది. స్పై యాక్షన్‌ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఆశించనంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అంతేకాకుండా విడుదలైన మొదటి రోజే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో ప్రేక్షకులు కనీసం సినిమా థియేటర్ వైపు వెళ్లడం కూడా మానేశారు. అఖిల్ ఈ సినిమా కోసం దాదాపుగా రెండేళ్లపాటు కష్టపడ్డాడు. జిమ్ లో వర్కౌట్స్ చేసే సిక్స్ ప్యాక్ బాడీ కోసం బాగానే కష్టపడ్డాడు. అయితే ఈ సినిమాతో తప్పకుండా సాలిడ్‌ హిట్‌ వస్తుంది అని దీంతోపాటు అభిమానులు కూడా అనుకున్నారు కానీ ఊహించని విధంగా దెబ్బ పడింది.

ఏజెంట్ సినిమా విడుదల కాకముందే రెండు వారాల నుంచి అసలు సినిమా పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోవడంతో సినిమా డిజాస్టర్ అయ్యాక తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడంతోపాటు భారీగా ట్రోలింగ్స్ కూడా చేశారు. దీంతో మరోసారి డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన అఖిల్ ఆ బాధ నుంచి బయటపడడం కోసం సింగల్ గా దుబాయ్ వెకేషన్ కు వెళ్లిపోయాడు. అందుకు సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.