Agent : ఏజెంట్ మొదటి రోజు కలెక్షన్స్ మరీ అంత తక్కువా?? ఇలా అయితే అయ్యగారికి కష్టమే…

ఎన్నో అంచనాలతో రిలీజయిన ఏజెంట్ సినిమా దారుణంగా విఫలమైంది. సినిమాలో బాగుంది అని చెప్పుకోవడానికి అఖిల్ బాడీ మేకోవర్ తప్ప ఇంకేమి లేదు.

Published By: HashtagU Telugu Desk
Akhil Agent Movie first day collections

Akhil Agent Movie first day collections

అఖిల్(Akhil), సాక్షివైద్య(Sakshi Vaidya) జంటగా సురేందర్ రెడ్డి(Surendar Reddy) దర్శకత్వంలో మమ్ముట్టి(Mammootty) ముఖ్య పాత్రలో వచ్చిన సినిమా ఏజెంట్(Agent). భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఏజెంట్ సినిమా భారీ అంచనాలతో రిలీజయింది. అంచనాలు ఉన్నా చాలా మందికి ఈ సినిమా విజయంపై డౌట్ గానే ఉంది మొదటి నుంచి. ఇక సినిమా రిలీజయ్యాక మొదటి ఆట నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది ఏజెంట్ సినిమా. సినిమాపై దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. సినిమా చూసిన వాళ్లంతా అఖిల్ ని, డైరెక్టర్ సురేందర్ రెడ్డి ని విమర్శిస్తున్నారు.

ఎన్నో అంచనాలతో రిలీజయిన ఏజెంట్ సినిమా దారుణంగా విఫలమైంది. సినిమాలో బాగుంది అని చెప్పుకోవడానికి అఖిల్ బాడీ మేకోవర్ తప్ప ఇంకేమి లేదు. అసలే సినిమాకు అఖిల్ మార్కెట్ ని మించి 50 కోట్ల భారీ బడ్జెట్ పెట్టారు. ఇక ఏజెంట్ ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే ఏకంగా 40 కోట్ల వరకు అయింది. చిత్రయూనిట్ ఓపెనింగ్స్ భారీగా వస్తాయని ఆశించారు. కానీ మొదటి రోజు మొదటి ఆట నుంచే నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ దారుణంగా వచ్చాయి.

అఖిల్ ఏజెంట్ సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే కేవలం 4 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఆ భారీ బడ్జెట్ సినిమాకు ఇవి దారుణమైన కలెక్షన్స్. అందుకే చిత్రయూనిట్ కూడా అధికారికంగా కలెక్షన్స్ రిలీజ్ చేయలేదు. ఈ కలెక్షన్స్ తో, ఈ ఫ్లాప్ టాక్ తో సినిమాకు కనీసం బ్రేక్ ఈవెన్ అవ్వడం కూడా కష్టమే అంటున్నారు. ఇప్పటికే వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతున్న అఖిల్ కి ఈ సినిమా కూడా ఫ్లాప్ అయి పెద్ద షాక్ ఇచ్చింది. ఇలా అయితే అఖిల్ కెరీర్ కష్టమే అంటున్నారు అభిమానులు, ప్రేక్షకులు.

 

Also Read :  Bichagadu 2 : బిచ్చగాడు 2 ట్రైలర్ చూశారా? ఈసారి అంతకు మించి..

 

  Last Updated: 29 Apr 2023, 11:10 PM IST