సంగీత దర్శకుడు తమన్ ‘అఖండ-2’ ( Akhanda 2) మూవీ గురించి అదిరిపోయే అప్డేడ్ ఇచ్చారు. యూపీలో జరుగుతున్న మహా కుంభమేళాలో ఈ మూవీ షూటింగ్ జరగనుందని ట్వీట్ చేశారు. కాగా ఈ సినిమాలో బాలయ్య అఘోరాగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పార్ట్-1 సూపర్ హిట్ అవ్వగా పార్ట్-2పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Bus Fire : నంద్యాలలో రన్నింగ్ బస్సుకు అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం
నందమూరి హీరో బాలకృష్ణ (Balakrishna) బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో వరుస హిట్స్ అందుకుంటున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో వరుసగా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. తాజాగా డాకు మహారాజ్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా మొదటిరోజే రూ.56 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించగా.. బాబీ డియోల్ విలన్ గా కనిపించాడు. ఈ సినిమానకు తమన్ అందించిన మ్యూజిక్ మెయిన్ హైలెట్. బాలయ్య, తమన్ కాంబోలో వచ్చిన ఈ సినిమా మ్యూజిక్ అదిరిపోయింది. ఈ క్రమంలోనే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అఖండ 2 అప్డేట్ ఇచ్చి అభిమానుల్లో మరింత జోష్ నింపారు. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను ‘మహాకుంభమేళా’లో చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని మూవీ టీమ్ అఫీషియల్ గా తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది. దీంతో అభిమానుల్లో బజ్ మరింత పెరిగింది. ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ సి రాంప్రసాద్, ఎడిటర్ తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్ లతో పాటు అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పని చేస్తున్నారు.
#Akhanda2 Shooting IN #KumbhMela2025 ⭐️⭐️⭐️⭐️⭐️💥💥💥💥💥💥💥⚡️⚡️⚡️⚡️⚡️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🦁🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 pic.twitter.com/U63edA9DEF
— thaman S (@MusicThaman) January 13, 2025