టాలీవుడ్ నందమూరి హీరో బాలయ్య బాబు ప్రస్తుతం మంచి జోష్ మీద ఉన్నారు. సీనియర్ హీరో అయినా బాలకృష్ణ ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తూ వరుసగా బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలలో నటిస్తున్నారు. ఇప్పటికే గత నాలుగు సినిమాలతో ఒకదాని తర్వాత ఒకటి విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బాలయ్య బాబు డబుల్ హ్యాట్రిక్ అందుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే బాలయ్య బాబు ప్రస్తుతం అఖండ 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
గతంలో విడుదల అయిన అఖండ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దానికి తోడు ఈ సినిమాకు సంబంధించి వినిపించిన వార్తలు సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఈ సినిమాను రామ్ ఆచంట గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో సంయుక్త, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎం.తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు.
చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ఇటీవలే హైదరాబాద్ లో ఒక కీలక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. కాగా తదుపరి కొత్త షెడ్యూల్ ను ఈ నెల రెండో వారం నుంచి హిమాలయాల్లో చిత్రీకరించేందుకు బోయపాటి సిద్ధమవుతున్నారట. అయితే అందుకోసం ప్రస్తుతం ఆయన హిమాలయాల్లోని పలు అందమైన ప్రదేశాల్లో రెక్కీ నిర్వహిస్తున్నారట. ఈ షెడ్యూల్ లో బాలయ్యకు సంబంధించిన అఖండ పాత్రపై కీలక సన్నివేశాలతో పాటు ఒక భారీ పోరాట ఘట్టాన్ని కూడా తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ లో బాలకృష్ణ రెండు పాత్రల్లో కనువిందు చేయనున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఇందులో ఒక కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా దసరా సందర్భంగా సెప్టెంబరు 25 న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్బంగా సినిమాను పూర్తి చేసి ప్రొమోషన్స్ కార్యక్రమాలను బాగా నిర్వహించాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది.