Site icon HashtagU Telugu

Akhanda 2 : అఖండ 2 టీజర్ వచ్చేసింది..ఇక థియేటర్స్ లలో పూనకాలే

Akhanda 2 Teaser

Akhanda 2 Teaser

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అఖండ 2 (Akhanda 2)టీజర్ వచ్చేసింది. డైరెక్టర్ బోయపాటి శ్రీను మార్క్ పక్కాగా కనిపించేలా టీజర్ డిజైన్ చేశారు. హిమాలయాల నేపథ్యంలో “శంభో” అంటూ ప్రారంభమైన టీజర్‌లో బాలయ్య (Balakrishna) రుద్ర తాండవం తో ఎంట్రీ ఇవ్వడం గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. విబూది, త్రిశూలం, జటాజూటం లుక్‌లో బాలయ్య తొలిసారి కనిపించబోతున్నారు. ధర్మాన్ని కాపాడేందుకు పరమశివుడే సింహం రూపంలో అవతరించినట్టు బాలయ్య పాత్ర డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటోంది.

Amit Shah : 11 ఏళ్ల మోడీ పాలన స్వర్ణయుగం లాంటిది : అమిత్ షా

టీజర్‌లోని పవర్‌ఫుల్ డైలాగ్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. “నా శివుడి అనుమతి లేకుండా ఆ యముడైనా కన్నెత్తి చూడడు” అనే డైలాగ్ మాస్ ఫ్యాన్స్‌ని ఫిదా చేస్తోంది. త్రిశూలాన్ని సుదర్శన చక్రంలా తిప్పుతూ శివుడు-నారాయణుడు కలిసి శత్రు సంహారం చేస్తున్నారన్నట్లుగా బోయపాటి ట్రీట్ ఇచ్చారు. “వేదం చదివిన శరభం యుద్ధానికి ఎదిగింది” అన్న డైలాగ్ సినిమాకు అద్భుతమైన మానసిక తీవ్రతను జోడిస్తోంది. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు మరో లెవెల్ ఎనర్జీని జోడించింది.

AP Government : ఉపాధి హామీ పనుల కోసం రూ. 176.35 కోట్ల విడుదలకు అనుమతి

‘అఖండ’ సక్సెస్‌కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అంచట, గోపీ అచంట నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించగా, ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ లాంటి బ్లాక్‌బస్టర్ల తర్వాత మళ్ళీ అదే స్థాయిలో మరో విజయం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. ‘అఖండ 2’ దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.