Site icon HashtagU Telugu

Akhanda 2 : తెలంగాణ లో ఈరోజు రాత్రి 8 గంటల నుండే అఖండ 2 ప్రీమియర్స్ ..టికెట్స్ ధరలు ఎలా ఉన్నాయంటే !!

Akhanda 2 Premiere Show

Akhanda 2 Premiere Show

నందమూరి అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అఖండ 2 మరికాసేపట్లో థియేటర్స్ లలో ప్రదర్శించబడుతుంది. బోయపాటి – బాలకృష్ణ కలయికలో వచ్చిన ప్రతి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో అఖండ కు సీక్వెల్ గా వస్తున్న ఈ అఖండ 2 కూడా భారీ విజయం సాదించబోతుందని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ ధరల పెంపు కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో పాటు ప్రీమియర్ షోస్ కు అనుమతులు ఇవ్వడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Vladimir Putin: ప్రధాని మోదీ ఒత్తిడికి లొంగే నాయకుడు కాదు: వ్లాదిమిర్ పుతిన్

ఈరోజు (గురువారం) రాత్రి 8 గంటల నుంచే ‘అఖండ-2’ ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయంతో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరింత వసూళ్లు సాధించేందుకు మార్గం సుగమమైంది. ప్రీమియర్ షో టికెట్ ధరను ఏకంగా రూ. 600గా ప్రభుత్వం నిర్ణయించడం ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌ను, దీనికి లభిస్తున్న ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది.

ప్రీమియర్ షోలకే కాకుండా, తదుపరి మూడు రోజుల పాటు కూడా టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. విడుదలైన మొదటి మూడు రోజులు, సినిమా హాళ్లు టికెట్ ధరలను సవరించుకోవచ్చు. ఇందులో భాగంగా సింగిల్ స్క్రీన్లలో రూ. 50 చొప్పున, మరియు మల్టీప్లెక్స్‌లలో రూ. 100 చొప్పున టికెట్ రేట్లను పెంచుకోవచ్చని ప్రభుత్వ ఉత్తర్వు (GO)లో స్పష్టంగా పేర్కొనబడింది. ఈ పెంపుదల సినిమా నిర్మాణ వ్యయాన్ని తిరిగి రాబట్టుకోవడానికి, అలాగే బయ్యర్లకు మంచి లాభాలు వచ్చేందుకు దోహదపడుతుంది. అయితే ఈ టికెట్ రేట్ల పెంపు ద్వారా వచ్చే అదనపు రెవెన్యూపై ప్రభుత్వం ఒక ముఖ్యమైన షరతు విధించింది. సామాజిక బాధ్యతను పంచుకునే ఉద్దేశంతో టికెట్ రేట్ల పెంపు ద్వారా వచ్చే రెవెన్యూలో 20% మొత్తాన్ని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA)కు ఇవ్వాలని GOలో నిర్దేశించడం జరిగింది.

Exit mobile version