Site icon HashtagU Telugu

Akhanda 2 New Release Date : అఖండ 2 వచ్చేది క్రిస్మస్ లేదంటే సంక్రాంతికే !!

Akhanda 2 Paid Premieres

Akhanda 2 Paid Premieres

‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ ..బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన ‘అఖండ 2’ సినిమా విడుదల తేదీపై నెలకొన్న సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది. ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందోనని బాలయ్య అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ కీలక ప్రకటన చేసింది. ‘అఖండ 2’ను పెద్ద స్క్రీన్లపైకి తీసుకురావడానికి తాము తమ వంతు ప్రయత్నాలు చేసినప్పటికీ, ‘అత్యంత షాకింగ్ విషయాలు’ ఎదురయ్యాయని, ఇది ‘చాలా బ్యాడ్ టైం’ అని పేర్కొంటూ విడుదల వాయిదా పడినందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు క్షమాపణలు తెలియజేసింది. ఈ సవాల్‌తో కూడిన సమయంలో తమకు మద్దతుగా నిలిచినందుకు బాలకృష్ణ మరియు దర్శకుడు బోయపాటి శ్రీనులకు కృతజ్ఞతలు చెప్పిన నిర్మాణ సంస్థ, త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని హామీ ఇచ్చింది.

Telangana Rising Global Summit : ప్రపంచ దృష్టిని ఆకర్షించబోతున్న గ్లోబల్ సమ్మిట్‌

‘అఖండ 2’ విడుదల వాయిదాకు ప్రధాన కారణం ఆర్థిక లావాదేవీల వివాదాలే అని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ధృవీకరించారు. అయితే ఆర్థికపరమైన సమస్యలు బయటకు వెల్లడించలేమని, అనవసర ప్రస్తావనలు సరికావని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వివాదాల వెనుక 14 రీల్స్ ప్లస్ సంస్థకు మరియు ఎరోస్ సంస్థకు మధ్య గత చిత్రాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు సినీ వర్గాల టాక్. ఈ వివాదం కారణంగానే ఎరోస్ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు సినిమా విడుదలపై స్టే విధించింది. 14 రీల్స్ ప్లస్ సంస్థ ఎరోస్ సంస్థకు చెల్లించవలసిన రూ. 28 కోట్ల మొత్తం, వడ్డీతో కలిపి ఒక చిన్న సినిమా బడ్జెట్‌కు సమానం అయ్యిందని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. ఈ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని సురేష్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

సినిమా విడుదల వాయిదా పడినప్పటికీ ‘అఖండ 2’ విడుదల తేదీపై ప్రచారం మాత్రం విస్తృతంగా జరుగుతోంది. ఈ నెల 18న లేదా క్రిస్మస్ బరిలో నిలుస్తుందనే ఊహాగానాలు ముందు వినిపించినా, ప్రస్తుతం సంక్రాంతికి మూవీ విడుదల అవుతుందని కొందరు చెబుతున్నారు. అదే నిజమైతే ఈసారి సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఏదేమైనా, 14 రీల్స్ ప్లస్ సంస్థ మరియు ఎరోస్ సంస్థ మధ్య ఉన్న ఆర్థిక వివాదాలు ఎప్పుడు పరిష్కారమవుతాయో స్పష్టత రావాల్సి ఉంది.

Exit mobile version