టాలీవుడ్ నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ బాబు ప్రస్తుతం మంచి జోష్ మీద ఉన్నారు. సీనియర్ హీరో అయినా బాలకృష్ణ ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తూ వరుసగా బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలలో నటిస్తున్నారు. ఇప్పటికే గత నాలుగు సినిమాలతో ఒకదాని తర్వాత ఒకటి వరుస విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బాలయ్య బాబు డబుల్ హ్యాట్రిక్ అందుకున్న విషయం తెలిసిందే.
ఇకపోతే బాలయ్య బాబు ప్రస్తుతం అఖండ 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. గతంలో విడుదల అయిన అఖండ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను విడుదల చేయాలని మూవీ మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. డాకు మహారాజ్ థియేటర్స్ కన్నా ఓటీటీ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
Akhanda 2 Gets A Huge Ott Deal B 0803250448
నెట్ ఫ్లిక్స్ లో డాకు మహారాజ్ వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అయ్యింది. దానితో బాలయ్య బోయపాటి అఖండ 2 పై ప్రముఖ ఓటీటీ సంస్థలు కన్నేశాయి. డాకు మహారాజ్ కన్నడ, తమిళ, హిందీ వెర్షన్స్ కలిపి 60 కోట్ల మేర ఓటీటీ డీల్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు అఖండ 2 కి పాన్ ఇండియాలోని పలు భాషల్లో దాదాపుగా 80 కోట్ల రికార్డ్ ప్రైస్ ని ప్రముఖ ఓటీటీ సంస్థలు కోట్ చేసి అఖండ 2 డిజిటల్ హక్కుల కోసం పోటీపడుతున్నట్లుగా టాక్ ఉంది. 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న అఖండ 2కి ఈమేర ఓటీటీ డీల్ సెట్ అయితే సగం బడ్జెట్ నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే కవర్ అవుతాయట. గతంలో విడుదల అయినా అఖండ మూవీ అఖండ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. మరి పార్ట్ 2 ఏ మేరకు సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి మరి.