Site icon HashtagU Telugu

Vidaamuyarchi : సంక్రాంతి బరిలో ఇంకో స్టార్ హీరో సినిమా.. అజిత్ ‘విడాముయ‌ర్చి’ టీజర్ రిలీజ్..

Ajith Vidaamuyarchi Movie Teaser Released Movie Releasing on Sankranthi

Ajith

Vidaamuyarchi : ఇప్పటికే సంక్రాంతి బరిలో తెలుగులో మూడు భారీ సినిమాలు ఉన్నాయి. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు సంక్రాంతి బరిలో పోటీ పడుతున్నాయి. వీటికి తోడు ఇప్పుడు ఇంకో డబ్బింగ్ సినిమా తోడైంది. తమిళ్ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న విడాముయ‌ర్చి కూడా సంక్రాంతి బరిలోకి రానుంది.

తాజాగా అజిత్ విడాముయ‌ర్చి టీజర్ రిలీజ్ చేసారు. ఈ టీజర్ లో ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం యాక్షన్ సీన్స్ తోనే నడిపించారు. టీజర్లో ఈ సినిమా సంక్రాంతికి వస్తుందని అధికారికంగా ప్రకటించారు. మీరు కూడా ఈ విడాముయ‌ర్చి టీజర్ చూసేయండి..

ఇక ఈ సినిమాని లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాలో ఆర‌వ్‌, రెజీనా క‌సాండ్ర‌, నిఖిల్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమిళ్ లో సంక్రాంతికి ఇదే పెద్ద సినిమా అయినా తెలుగులో మూడు భారీ సినిమాల మధ్యలో ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

Also Read : Naga Chaitanya – Sobhita : మొదలైన నాగచైతన్య – శోభిత పెళ్లి వేడుకలు.. హల్దీ సెలబ్రేషన్స్ వీడియో చూశారా?