Trisha : త్రిషని రికమెండ్ చేసిన అజిత్.. వరుసగా రెండు సినిమాలు..!

విడా ముయార్చి టైట్ షెడ్యూల్ లో త్రిష చూపిన డెడికేషన్ చూసి అజిత్ (Ajith) తన నెక్స్ట్ సినిమాకు కూడా ఆమెను రికమెండ్ చేశాడట. ఎలాగు సూపర్ హిట్ జోడీ కాబట్టి మేకర్స్

Published By: HashtagU Telugu Desk
Star Heroine, Trisha, Tamilanadu. CM, Political Dream, Trisha Krishnan

Star Heroine, Trisha, Tamilanadu. CM, Political Dream, Trisha Krishnan

సౌత్ లో రెండు దశాబ్దాలుగా హీరోయిన్ గా సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తుంది త్రిష. తమిళ్, తెలుగు భాషల్లో త్రిషకు ఇప్పటికీ సూపర్ ఫాలోయింగ్ ఉంది. మధ్యలో కొంత కెరీర్ గాడి తప్పైనట్టు అనిపించినా మళ్లీ అమ్మడు ఫాం లోకి వచ్చింది. త్రిష ప్రస్తుతం విజయ్ (Vijay) గోట్, అజిత్ విడా ముయార్చి సినిమాలో నటిస్తుంది. అజిత్ తో అంతకుముందు గాంబ్లర్ సినిమాలో నటించిన త్రిష (Trisha) ఆ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు.

విడా ముయార్చి (Vida Muyarchi) తో కూడా ఈ జోడీ మరో సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఈ సినిమాను మగిజ్ తిరుమేని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటుగా అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను ఆధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో కూడా త్రిష ని హీరోయిన్ గా తీసుకుంటున్నారని తెలుస్తుంది.

విడా ముయార్చి టైట్ షెడ్యూల్ లో త్రిష చూపిన డెడికేషన్ చూసి అజిత్ (Ajith) తన నెక్స్ట్ సినిమాకు కూడా ఆమెను రికమెండ్ చేశాడట. ఎలాగు సూపర్ హిట్ జోడీ కాబట్టి మేకర్స్ ఓకే అన్నారట. విజయ్ తో ఆల్రెడీ లియో చేసిన త్రిష వెంటనే గోట్ ఛాన్స్ అందుకుంది. సీనియర్ హీరోయిన్ కి లక్ బాగా కలిసి వస్తుంది.

అజిత్ తో విడా ముయార్చి పూర్తి చేయడమే ఆలస్యం వెంటనే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ 2025 సంక్రాంతికి రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నారు. త్రిష ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తెలుగులో కూడా క్రేజీ ఛాన్స్ అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి తో విశ్వంభర సినిమాలో నటిస్తుంది అమ్మడు. ఆ సినిమాతో కూడా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకోనుందని చెప్పొచ్చు.

Also Read : Nani Saripoda Shanivaram : నాని అక్కడ స్ట్రాంగ్ అవుతున్నాడా..?

  Last Updated: 03 Sep 2024, 04:34 AM IST