Site icon HashtagU Telugu

Ajith Kumar : అజిత్ కుమార్ విలన్‌గా.. బాలీవుడ్ నటుడు హీరోగా.. దర్శకుడు శివ సినిమా..

Ajith Kumar Fifth Movie With Director Siva Is On Talks

Ajith Kumar Fifth Movie With Director Siva Is On Talks

Ajith Kumar : తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్.. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ప్రెజెంట్ దర్శకుడు మగిజ్ తిరుమేనితో ‘విడ ముయిర్చి’ సినిమా చేస్తున్నారు. దీంతో పాటు అధిక రవిచంద్రన్ దర్శకత్వంలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే సినిమాని కూడా ఇటీవలే స్టార్ట్ చేసారు. ఇప్పుడు మరో సినిమాకి సంబంధించిన పనులను కూడా మొదలు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కోలీవుడ్ లో అజిత్ అండ్ దర్శకుడు శివ కాంబోకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అజిత్ తో డైరెక్టర్ శివ వరుసపెట్టి నాలుగు సినిమాలను తెరకెక్కించారు. ఈ నాలుగు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు ఐదోసారి ఈ కాంబో మళ్ళీ చేతులు కలపబోతుందట. సూర్యతో ‘కంగువ’ తెరకెక్కిస్తున్న శివ.. ఆ తరువాత అజిత్ తో సినిమాని పట్టాలు ఎక్కించబోతున్నారట. కాగా ఈ సినిమా తమ గత కాంబోలో వచ్చిన నాలుగు చిత్రాలు కంటే బిన్నంగా ఉంటుందట.

ఈ సినిమాలో అజిత్ పూర్తి నెగటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నారట. బాలీవుడ్ నటుడు మెయిన్ లీడ్ లో కనిపించబోతున్నారట. సరిగ్గా చెప్పాలంటే.. అజిత్ విలన్‌గా, బాలీవుడ్ నటుడు హీరోగా కనిపించబోతున్నారట. నిజానికి ఈ ప్రాజెక్ట్ గతంలోనే చేయాల్సిందట. కానీ అప్పుడు కొన్ని కారణాలు వల్ల పెండింగ్ లో పడింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి అన్ని అడ్డంకులు తప్పడంతో.. కంగువ తరువాత పట్టాలు ఎక్కించడానికి శివ రంగం సిద్ధం చేస్తున్నారట.

ఆ సమయానికి అజిత్ ‘విడ ముయిర్చి’ షూటింగ్ కూడా పూర్తి అవుతుంది. మరి నాలుగు సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న ఈ కాంబో.. ఈసారి ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి. అజిత్ అభిమానులు అయితే.. ఈ కాంబో కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.