Site icon HashtagU Telugu

Bollywood Vs Sandalwood: అజయ్ దేవగణ్, కిచ్చా సుదీప్ మధ్య ట్వీట్ వార్…హిందీనే గొప్ప అంటూ..!!

Ajay Kiccha Imresizer

Ajay Kiccha Imresizer

మొన్న బాహుబలి, నిన్న ఆర్ఆర్ఆర్, నేడు కేజీఎఫ్ 2 ఇలా బాలివుడ్ బాక్సాఫీస్ దగ్గర వరుసగా దక్షిణాది సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలుస్తున్నాయి. ఏకంగా బాలివుడ్ సూపర్ స్టార్ సినిమాలు ఎప్పుడు ఊహించని రూ. 1000 కోట్ల క్లబ్ లో టాలివుడ్, సాండిల్ వుడ్ సినిమాలు చేరిపోతున్నాయి. ఇక ఇది సరిపోనట్లుగా మొన్నటి పుష్ప సినిమా కూడా బాలివుడ్ లో దుమ్ము రేపింది. పుష్ప సీక్వెల్ కూడా బాలివుడ్ ప్రేక్షకులను సమ్మోహన పరుస్తుంది అనుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే బాలీవుడ్ చిన్నోబోయేలా తెలుగు, కన్నడ, తమిళ, మళయాళ సినిమాలు సత్తా చాటుతున్నాయి.ఇదిలా ఉంటే గతంలో బాలీవుడ్ హీరోలు సౌత్ సినిమాలను చిన్న చూపు చూసేవారు. ముఖ్యంగా రజనీకాంత్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలు చేసే ఫైట్స్, డాన్సులను ట్రోల్ చేసేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సౌత్ సినిమాలు స్థాయి పెరిగింది. ప్రభాస్, అల్లు అర్జున్, యష్, రాంచరన్, జూనియర్ ఎన్టీఆర్, రాణా లాంటి స్టార్స్ కు ముంబై, ఢిల్లీ లాంటి నగరాల్లో అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు.

అయితే బాలివుడ్ హీరోలు కేజీఎఫ్ చిత్రం సాధించిన విజయం పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే హిందీ బెల్ట్ లో మాస్ ప్రేక్షకుల్లో కెజియఫ్ 2 విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో బాలివుడ్ హీరోల కాళ్ల కిందకు నీళ్లు వచ్చేశాయి. అయితే తాజాగా కన్నడ నటుడు కిచ్చా సుదీప్ కేజీఎఫ్ 2 సినిమా ప్రశంసల వర్షం కురిపిస్తూ ఇకపై హిందీ ఎంత మాత్రం జాతీయ భాష కాదన్నాడు. సుదీప్ మాటలకు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కూడా కటువుగా బదులిచ్చాడు.

సుదీప్‌కు కౌంటర్ గా అజయ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. సోదరా..కిచ్చా సుదీప్..హిందీ జాతీయ భాష కాదని నువ్వు అంటున్నావు మరి సినిమాను నీ ప్రాంతీయ భాషలో విడుదల చేయకుండా ఎందుకు హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నావు..? ఇప్పుడు, ఎప్పుడు హిందీ జాతీయ భాష, అని అజయ్ దేవగణ్ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు.

బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ ట్వీట్‌కు సుదీప్ రిప్లై ఇచ్చాడు. నా మాటలను మీరు తప్పుగా నన్ను అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. మిమ్మల్ని వ్యక్తిగతంగా కలసినప్పుడు ఆ మాటలను ఎందుకు అన్నానో నేను వివరంగా చెపుతాను, ఎవరినీ బాధపెట్టాలని, రెచ్చగొట్టాలని ఆ వ్యాఖ్యలు చేయలేదు. దేశంలోని ప్రతి భాష మీద నాకు గౌరవం ఉంది. ఈ టాపిక్ ఇక్కడితే ముగిసిపోతే బాగుంటుంది అన్నారు.

అంతే కాదు త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. హిందీలో మీరు చేసిన ట్వీట్ నాకు అర్థమైంది అన్నారు సుధీప్. నాకు హిందీ మీద ప్రేమ, గౌరవం ఉంది కాబట్టే నేర్చుకున్నాను. కానీ, కన్నడలో నేను రిప్లై ఇస్తే పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నాను అని కిచ్చా సుదీప్ ట్విట్టర్‌లో తెలియకుండానే చివర్లో చురక అంటించారు. కాసేపటికే అజయ్ దేవగణ్ ట్విట్టర్‌లో మరో పోస్ట్ షేర్ చేసాడు.

సుదీప్ నువ్వు నా స్నేహితుడివి. అపార్థాన్ని విడమరిచి చెప్పినందుకు ధన్యవాదాలు. సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక్కటే అని నేను భావిస్తాను. మేం అన్ని భాషలను గౌరవిస్తాం. అలాగే ప్రతి ఒక్కరూ అన్ని భాషలను గౌరవించాలని కోరుకుంటామంటూ అజయ్ మరోసారి ట్వీట్ చేశాడు.

ఇదిలా ఉంటే నెటిజన్లు మాత్రం అజయ్ దేవగన్ పై మండి పడుతున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం హిందీకి జాతీయ భాష హోదా అనేది లేదు. రాజ్యంగం గుర్తించిన 22 అధికార భాషల్లో హిందీ ఒకటి, హిందీ అధికార బాష మాత్రమే. అని నెటిజన్లు అజయ్ దేవగణ్ కు గుర్తు చేశారు.