Bollywood: ఒకే వేదికపై ఐశ్వర్య, సల్మాన్

దేశవ్యాప్తంగా దీపావళి సందడి మొదలైంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. తాజాగా బాలీవుడ్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా దీపావళి వేడుకలు నిర్వహించారు.

Bollywood: దేశవ్యాప్తంగా దీపావళి సందడి మొదలైంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. తాజాగా బాలీవుడ్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఒకప్పటి ప్రేమ పక్షులు హాజరయ్యాయి. ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు ఆ ఇద్దరి గురించి సోషల్ మీడియాలో తెగ చర్చిస్తున్నారు.

ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా దీపావళి వేడుకల్లో ఐశ్వర్యరాయ్ , సల్మాన్ ఖాన్ లు హాజరయ్యారు.ఐశ్వర్యరాయ్ , సల్మాన్ ఖాన్ ఇద్దరి రిలేషన్ గురించి అందరికీ తెలిసిందే. దీంతో ఇద్దరు ఒకేచోట సందడి చేయడం చర్చనీయాంశమైంది. కాగా ఈ పార్టీలో నటులు రేఖ, గౌరీ ఖాన్, సుహానా ఖాన్, ఖుషీ కపూర్, అనన్య పాండే, వరుణ్ ధావన్‌లతో పాటు సల్మాన్ ఖాన్ మరియు ఐశ్వర్యరాయ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈసారి స్పెషల్ పార్టీ కోసం ఐశ్వర్య రెడ్ డ్రెస్ వేసుకుంది. సల్మాన్ బ్లాక్ జీన్స్ మరియు లేత నీలం రంగు టీ షర్ట్ ధరించాడు. ప్రస్తుతం ఈ పార్టీలో సెలబ్రిటీల లుక్స్‌కి సంబంధించిన పలు వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Also Read: ​ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ విడుదల.. బ్యాటింగ్ లో గిల్, బౌలింగ్ లో సిరాజ్ నంబర్ వన్..!