Aishwarya with Mahesh: మహేశ్ బాబుతో ఐశ్వర్యా రాయ్.. భారీ హైప్ క్రియేట్ చేస్తున్న SSMB 28!

SSMB 28 అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రంగా తెరకెక్కబోతోంది. మొదటిసారి ఐశ్వర్య రాయ్ మహేశ్ బాబుతో కలిసి నటించబోతోంది.

Published By: HashtagU Telugu Desk
Mahesh And Aishwarya

Mahesh And Aishwarya

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు (Mahesh Babu), స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. దీంతో SSMB 28 అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రంగా తెరకెక్కబోతోంది. ఈ దర్శక-నటుల ద్వయం నుండి వచ్చిన గత రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. అతడు, ఖలేజా సినిమాలు నేటికీ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాయి. దీంతో రాబోయే చిత్రంతో ఈ ఇద్దరు హ్యాట్రిక్ హిట్ కొట్టే అవకాశాలున్నాయని ఫ్యాన్స్ వెయిటింగ్ చేస్తున్నారు. ఈ మూవీలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, శ్రీలీల సహాయక పాత్రలో కనిపించనుంది.

ఇది మహేష్ బాబు 28వ చిత్రం. రాజకీయ నేపథ్యం చుట్టూ తిరుగుతుందని అంటున్నారు. తాజాగా ఈ మూవీ గురించి మరో అప్ డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ క్వీన్ ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. అవును, మీరు చదివింది నిజమే! త్రివిక్రమ్ శ్రీనివాస్ తన రాబోయే చిత్రంలో నెగిటివ్ రోల్ పోషించాలని ఐశ్వర్యను సంప్రదించినట్లు సమాచారం. ఐష్ గత సంవత్సరం “పొన్నియిన్ సెల్వన్” (PS1) చిత్రంలో నెగెటివ్ రోల్ పోషించడం చూశాం.

ఇది ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. ఆ చిత్రంలో ఆమె నటన (Aishwarya Rai) ప్రతిఒక్కరిని ఆకట్టుకుంది. టీమ్ ఆమెను సంప్రదించడానికి ఇది ఒక కారణం కావచ్చునని తెలుస్తోంది. ఈ బాలీవుడ్ బ్యూటీతో టీమ్, మేకర్స్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే దీనిపై అధికారికంగా అనౌన్స్ చేయాల్సి ఉంది. అయితే ఈ మూవీ పాన్-ఇండియాగా తెరకెక్కబోతుండటంతో ఐశ్వర్య రాయ్‌ (Aishwarya Rai)ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే మహేష్ బాబు, ఐశ్వర్యరాయ్ కలిసి మొదటిసారి బిగ్ స్క్రీన్‌పై చూడటం ట్రీట్ అవుతుంది.

Also Read: Hyderabad Traffic Restrictions: అటు ‘బడ్జెట్’, ఇటు ‘ఈ రేస్’.. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు!

  Last Updated: 02 Feb 2023, 01:26 PM IST