Site icon HashtagU Telugu

Aishwarya Rai : సల్మాన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డ – ఐశ్వర్య రాయ్

Salman Khan Aishwarya Rai

Salman Khan Aishwarya Rai

ఐశ్వర్యరాయ్ – సల్మాన్ ఖాన్ (Salman Khan Aishwarya rai) మధ్య ప్రేమాయణం గురించి తెలియని వారు ఉండరు. 1999లో “హమ్ నీం అప్ అన్నే” సినిమా షూటింగ్ సమయంలో ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. వీరి ప్రేమ గురించి 2001లో పబ్లిక్‌గా ప్రకటించారు. కానీ కొంత కాలం తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం తో విడిపోయారు.

గత కొద్దిరోజులుగా ఐశ్వర్యరాయ్ వ్యక్తిగత జీవితం గురించి అనేక కథనాలు వెలువడుతున్నాయి. ఆమె తన భర్త అభిషేక్ బచ్చన్ తో విడాకులు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2007లో ప్రేమ వివాహం చేసుకున్న ఐశ్వర్యరాయ్ మరియు అభిషేక్ బచ్చన్‌కు ఆరాధ్య అనే పాప ఉన్నది. 16 సంవత్సరాల పాటు బాగానే సాగిన వీరి కాపురంలో, గత కొంతకాలంగా విభేదాలు నెలకొన్నట్లు సమాచారం. ఇటీవల, బాలీవుడ్ మీడియా ఈ విషయంలో మరింత కథనాలు రాసింది. త్వరలోనే అభిషేక్, ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వస్తున్నారు.

ఐశ్వర్య రాయ్, “మేము కలిసే ఉన్నాం, విడాకులు తీసుకోవడం లేదు” అంటూ కుటుంబ ఫోటోలు పంచుకున్నా, ఆ పుకార్లు ఆగడం లేదు. అదే సమయంలో, ఐశ్వర్య ఒక డాక్టర్ అయిన జిరాక్ మార్కర్ తో సన్నిహితంగా ఉంటుందని కొన్ని కథనాలు బయటకు వచ్చాయి. అయితే, ఈ స్నేహం ఇప్పుడు వేరే సంబంధంగా మారిందనే చర్చలు జరుగుతున్నాయి. ఐశ్వర్య యొక్క సన్నిహితులు, జిరాక్ ఆమె చిన్ననాటి స్నేహితుడు అని వెల్లడించారు.

తాజాగా, ఓ నటి కారణంగా ఐశ్వర్య మరియు అభిషేక్ బచ్చన్‌ యొక్క వైవాహిక జీవితంలో విభేదాలు చోటు చేసుకున్నాయని రూమర్స్ తెరపైకి వచ్చాయి. దస్వి సినిమా నటి నిమ్రత్ కౌర్ తో అభిషేక్ బచ్చన్‌ సన్నిహితంగా ఉండటం వల్ల ఈ గొడవలు జరిగాయని ప్రచారం మొదలైంది. తాజాగా ఐశ్వర్య రాయ్ ఒక ఇంటర్వ్యూలో.. సల్మాన్ ఖాన్ తో ఉన్న సంబంధంపై స్పందించారు. ఆమె చెబుతూ, “సల్మాన్ తో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మద్యం సేవించి, సల్మాన్ అనుచితంగా ప్రవర్తించేవాడు. ఇది నా జీవితంలోని చేదు ఘటన” అని వివరించారు. ఐశ్వర్య రాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read Also : Khamenei : ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆరోగ్యం విషమం.. వారసుడిగా ముజ్తబా ఖమేనీ ?