Aishwarya Rai Pay: పొన్నియిన్ సెల్వన్ కీ ఐశ్వర్య రాయ్ అంత రెమ్యూనరేషన్ తీసుకుందా?

ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించిన తాజా చిత్రం పొన్నియిన్ సెల్వన్. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ

  • Written By:
  • Updated On - September 30, 2022 / 04:17 PM IST

ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించిన తాజా చిత్రం పొన్నియిన్ సెల్వన్. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే. పదవ శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని నిజ సంఘటనల సమాహారంగా ఈ సినిమాను రూపొందించారు. ఇకపోతే ఈ సినిమాలో విక్రమ్‌, ఐశ్వర్య రాయ్‌, ‘జయం’ రవి, త్రిష, కార్తి ల కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా నేడు అనగా సెప్టెంబర్ 30న భారీ అంచనాలను రమ్మ దేశవ్యాప్తంగా విడుదల అయింది.

అయితే విడుదలైన మొదటి షో కి పాజిటివ్ టాక్ నీ తెచ్చుకుంది ఈ సినిమా. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు చిత్ర బృందం ఎంతగానో ఎదురు చూసిన విషయం తెలిసిందే. ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ రెమ్యూనరేషన్ గురించి జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ వార్త ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఈ సినిమాలో ఐశ్వర్య అద్భుతంగా నటించింది. ఇక ఈ సినిమాకు గాను ఐశ్వర్య ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంది అన్న విషయానికి వస్తే.. ఇక ఈ సినిమాలో నటించినందుకు గాను చియాన్ విక్రమ్ 12 కోట్ల రూపాయలు పారితోషికంగా అందుకున్నారు. అలాగే ఐశ్వర్యారాయ్ 10 కోట్ల రూపాయలను పాడుతోషంగా అందుకుంది. మిగిలిన నటులు కూడా కోట్లలోనే పారితోషికాన్ని అందుకున్నారు.