Venkatesh : ‘ప్రేమించుకుందాం రా’ సినిమాలో హీరోయిన్‌గా ఐశ్వర్యారాయ్‌ నటించాల్సింది.. మరి ఏమైంది?

1997 లో వచ్చిన ‘ప్రేమించుకుందాం రా’ మూవీలో హీరోయిన్ గా అంజలా ఝవేరి (Anjala Zhaveri) నటించింది.

Published By: HashtagU Telugu Desk
Aishwarya Rai Missed Chance in Venkatesh Preminchukundam Raa Movie

Aishwarya Rai Missed Chance in Venkatesh Preminchukundam Raa Movie

వెంకటేష్(Venkatesh) కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అందులో ఎప్పటికి మర్చిపోలేని పలు లవ్ స్టోరీస్ కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి 1997 లో వచ్చిన ‘ప్రేమించుకుందాం రా’(Preminchukundam Raa). దీన్‌రాజ్ కథ, పరుచూరి బ్రదర్స్(Paruchuri Brothers) స్క్రీన్ ప్లే, జయంత్‌ సి పరాన్జీ(Jayanth C Paranjee) దర్శకత్వం సినిమాని సూపర్ హిట్టుగా చేసింది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా అంజలా ఝవేరి (Anjala Zhaveri) నటించింది. సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు ఇప్పటి ఆడియన్స్ ని కూడా ఎంతగానో అలరిస్తాయి.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ కి ప్రేమ తెలిపేందుకు వెంకటేష్ లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ ఉపయోగించడం చూసి.. అప్పటి కుర్రకారు తమ ప్రేమని అలా తెలపడానికి ప్రయత్నాలు చేశారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ ముందుగా అనుకున్నది అంజలా ఝవేరిని కాదట. దర్శకుడు జయంత్‌ ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఐశ్వర్యారాయ్‌ (Aishwarya Rai) ని అనుకున్నాడు. పైగా జయంత్‌కు ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ ద్వారా ఐశ్వర్యతో ఆల్రెడీ పరిచయం ఉంది. ఇక ఆమెను ఈ సినిమాలోకి తీసుకుందామని చిత్ర నిర్మాతలతో చెప్పగా.. వాళ్ళు వద్దు అని చెప్పారట.

అప్పటికే ఐశ్వర్య నటించిన 3 సినిమాలు ప్లాప్ లుగా నిలిచాయి. దీంతో ఆమె ఫ్లాప్‌ హీరోయిన్‌ గా ముద్ర వేసుకుంది. ఆ సెంటిమెంట్ తో ఆమెను నిర్మాతలు కాదు అనడంతో.. ఆ ఆఫర్ అంజలా ఝవేరిని వరించింది. అలా ఐశ్వర్య రాయ్ కి తెలుగులో ఓ హిట్ సినిమామిస్ అయింది. ఇక ఈ సినిమా గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే.. ఈ మూవీలోని సాంగ్స్ ఆల్ టైం చార్ట్ బస్టర్ అనే చెప్పాలి. ఈ సినిమాలో 6 పాటలు ఉండగా.. 3 పాటలు మణిశర్మ, 3 పాటలు మహేష్ మహదేవన్ ఇచ్చారు.

 

Also Read : Chiranjeevi : నేను ఆ టెస్ట్ చేయించకపోతే క్యాన్సర్ వచ్చేదేమో.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు..

  Last Updated: 03 Jun 2023, 07:44 PM IST