బాలీవుడ్ ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్ కారుకు ప్రమాదం (Aishwarya Rai Car Accident) జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ముంబయ్ రోడ్లపై ప్రయాణిస్తున్న సమయంలో ఆమె కారును ఒక రెడ్ కలర్ బస్సు వెనక నుంచి ఢీ కొట్టినట్లు వీడియోలు చూపిస్తున్నాయి. ఈ సంఘటన జరిగిన వెంటనే అక్కడ స్థానికులు, పోలీసులు చేరుకుని పరిశీలించారు. అయితే కారు వెనక నుండి ఢీ కొట్టినప్పటికీ, కారులో ఉన్నవారికి ఎటువంటి ప్రమాదం జరుగలేదు. ఐశ్వర్య రాయ్ ఆ సమయంలో కారులో ఉన్నారా లేదా అనే విషయం మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అయితే 5050 నెంబర్ ఉన్న కారు బచ్చన్ ఫ్యామిలీకి చెందినదే కావడంతో అభిమానులు ఆ కారు ఐశ్వర్యదేనని భావిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కారు వెనక భాగంలో స్వల్పంగా డ్యామేజ్ అయినట్లు వీడియోల్లో కనిపిస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఐశ్వర్య రాయ్ స్టాఫ్ బయటకు వచ్చి కారును పరిశీలించినట్లు తెలుస్తోంది. కారు ఎక్కువగా డ్యామేజ్ కాలేదని నిర్ధారించుకున్న అనంతరం, వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే వీడియోల్లో ఐశ్వర్య రాయ్ ఎక్కడా కనిపించలేదు. అందుకే అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆమె బాగానే ఉన్నారనే విషయం స్పష్టం చేయాలని కోరుతున్నారు.
Snapchat : స్నాప్‌చాట్‌లోకి నేచురల్ స్టార్ నాని రంగప్రవేశం
సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా యాక్టివ్‌గా లేకపోయినా, ఐశ్వర్య రాయ్ ఇటీవల తన కుటుంబంతో కలిసి ప్రముఖ దర్శకుడు అషుతోష్ గోవారికర్ కుమారుడు కోనార్క్ గోవార్కర్ పెళ్లికి హాజరయ్యారు. ఈ వివాహ వేడుకలో బచ్చన్ ఫ్యామిలీ మొత్తం కలిసి సందడి చేసింది. ఇకపోతే, ఇటీవల ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ మధ్య విభేదాలు పెరిగాయని, విడాకుల కోసమే ఎదురు చూస్తున్నారని బాలీవుడ్‌లో పలు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రతి సందర్భంలోనూ ఈ జంట కలిసి కనిపిస్తూ ఈ రూమర్లకు తెర దించారు. ప్రస్తుత కారు ప్రమాద ఘటనపై ఐశ్వర్య రాయ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ऐश्वर्या राय की कार का हुआ ऐक्सीडेंट, बस ने पीछे से मारी टक्कर
ऐश्वर्या राय बच्चन की लग्जरी कार टोयोटा वेलफायर बुधवार को सड़क हादसे का शिकार हो गई pic.twitter.com/rHEePPEPYE
— Ashish rai (@journorai) March 26, 2025