Aishwarya Rai Lip Kiss: కూతురికి లిప్ కిస్ పెట్టిన ఐశ్వర్యరాయ్.. నెటిజన్స్ ట్రోలింగ్

బాలీవుడ్ క్వీన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్ కుమార్తె ఆరాధ్య 11వ పుట్టినరోజు ఇవాళ. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్‌తో

  • Written By:
  • Updated On - November 16, 2022 / 05:03 PM IST

బాలీవుడ్ క్వీన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్ కుమార్తె ఆరాధ్య 11వ పుట్టినరోజు ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలియజేశారు. తన కూతురితో ఉన్న ఫొటోను కూడా షేర్ చేసింది. ఆ ఫొటోలో ఐశ్వర్య తన కుమార్తెను ముద్దుపెట్టుకోవడం చూడొచ్చు. “నా ప్రేమ.. నా జీవితం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా ఆరాధ్య” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు దారి తీసింది.

“పిల్లల పెదవులపై ముద్దు పెట్టుకోవడం విచిత్రం” ఓ అని నెటిజన్ కామెంట్ చేశాడు. పబ్లిసిటీ పొందడానికి ఐశ్వర్య ఇలా చేసిందని, “పెదవులపై ఎందుకు ముద్దు పెట్టారు’’ అని ట్రోల్స్ చేశారు. అయినప్పటికీ చాలా మంది అభిమానులు ఐశ్వర్య కు పోస్ట్ ను ఇష్టపడ్డారు. తల్లి, బిడ్డల సంబంధాన్ని అంచనా వేయడం మానేయండి. ఇది కేవలం ముద్దు. తల్లి బిడ్డ పట్ల ఉండే స్వచ్ఛమైన ప్రేమ తప్ప మరేమీ లేదు. ఆమె అమ్మ’’ అని మరికొందరు నెటిజన్స్ ఐశ్వర్యకు సపోర్ట్ చేశారు. ప్రస్తుతం ఐశ్వర్య పోస్ట్ వైరల్ గా మారింది.